EPFO Profile Photo: మీరు ఈపీఎఫ్‌ అకౌంట్‌లో ఫోటో అప్‌లోడ్‌ చేయలేదా..? డబ్బులు రావడం కష్టమే.. ఎలా చేయాలో తెలుసుకోండి

EPFO Profile Photo: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్‌ చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. సాంకేతిక..

EPFO Profile Photo: మీరు ఈపీఎఫ్‌ అకౌంట్‌లో ఫోటో అప్‌లోడ్‌ చేయలేదా..? డబ్బులు రావడం కష్టమే.. ఎలా చేయాలో తెలుసుకోండి
Follow us

|

Updated on: May 24, 2022 | 9:16 AM

EPFO Profile Photo: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్‌ చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటం వల్ల వివిధ పనుల నిమిత్తం పీఎఫ్‌ (PF) కార్యాలయానికి వెళ్లుకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. అయితే పీఎఫ్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకునేవారు ఈ-నామినేషన్‌ నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఈ-నామినేషన్‌ పూర్తి చేయకపోతే డబ్బులు విత్‌డ్రా చేసుకోలేరు. అందుకు పీఎఫ్‌ ఖాతాదారులు ఈ-నామినేషన్‌ పనిని పూర్తి చేసుకోవడం మంచిదని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. అయితే చాలా మంది ఈ నామినేషన్‌ ఫైలింగ్‌ చేస్తున్నా.. అది పూర్తి కావడం లేదంటే అందుకు కారణాలను గమనించాల్సి ఉంటుంది. ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్‌ అప్‌డేట్‌ చేయకపోతే ఈ-నామినేషన్‌ పూర్తి చేయలేమనే విషయాన్ని గుర్తించుకోవాలి.

ప్రొఫైల్‌ ఫోటో అప్‌లోడ్‌ చేయడం ఎలా..

☛ మీరు ఉందుగా యూఏఎన్‌ (UAN) నెంబర్‌ ఐడీతో ఈపీఎఫ్‌లో పోర్టల్‌ఓల లాగిన్‌ కావాలి

ఇవి కూడా చదవండి

☛ ఆ తర్వాత మెనూ సెక్షన్‌లో క్లిక్‌ చేస్తే అక్కడ ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది

☛ ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. మీకు ఎడమ వైపులో ప్రొఫైల్‌ ఫోటో ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ క్లిక్‌ చేసి ఫోటోను మార్చడం, లేదా అప్‌లోడ్‌ చేయడం చేయాలి

☛ ప్రొఫైల్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఈపీఎఫ్‌ఓలో మీ ఫోటో అప్‌లోడ్‌ చేయాలి

☛ మన రెండు చెవులు కనిపించేలా ఫోటో విజువల్‌ ఉండేలా చూసుకోవాలి. ఫోటో JPEG, JPG, PNG ఫార్మాట్‌లో సేవ్‌ చేయాలి

☛ ఆ తర్వాత అప్‌లోడ్‌ యువర్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఓకే అనే ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి. దీంతో మీ ఫోటో అప్‌లోడ్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి