Post office saving schemes: సీనియర్ సిటిజన్స్ కోసం అద్భుతమైన స్కీమ్.. అనేక ప్రయోజనాలు
Senior Citizen Savings: సీనియర్ సిటిజన్స్ కోసం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం వారికి ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. మీరు భవిష్యత్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న..
Senior Citizen Savings: సీనియర్ సిటిజన్స్ కోసం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం వారికి ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. మీరు భవిష్యత్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌ను ఎంచుకోవడం ఎంతో మేలు. ఈ స్కీమ్‌లో చేరితో తప్పకుండా రాబడి పొందుతారు. ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బ్యాంక్ డిఫాల్ట్ అయితే మీరు కేవలం రూ.5 లక్షలు మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసు అలా కాదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇది కాకుండా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో పెట్టుబడి చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు. పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) కూడా ఒకటి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సంవత్సరానికి 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ స్కీమ్ 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉంది. డిపాజిట్ మొదటి దశలో వడ్డీ తేదీ 31 మార్చి లేదా 30 సెప్టెంబర్ లేదా 31 డిసెంబర్‌న చెల్లిస్తారు. ఆ తర్వాత మార్చి 31, జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 తేదీల్లో చెల్లిస్తారు. ఈ చిన్న పొదుపు పథకంలో రూ.1000 మొత్తంతో పెట్టుబడి పెట్టవచ్చు. మొత్తం రూ.15 లక్షలకు మించకూడదు.
60 ఏళ్లు పైబడిన వ్యక్తి పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇది కాకుండా 55 ఏళ్లు పైబడిన 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఉద్యోగి కూడా ఖాతాను తెరవవచ్చు. ఇది కాకుండా 50 ఏళ్లు పైబడిన 60 ఏళ్లలోపు రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది ఖాతాను తెరవవచ్చు. అయితే రిటైర్‌మెంట్ బెనిఫిట్‌లు అందిన ఒక నెలలోపు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడిదారు వ్యక్తిగత సామర్థ్యంలో లేదా జీవిత భాగస్వామితో ఉమ్మడి ఖాతాగా ఉండవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల తర్వాత మూసివేయవచ్చు. దీని కోసం వ్యక్తి పాస్‌బుక్‌తో పాటు తగిన దరఖాస్తు ఫారమ్‌ను సంబంధిత పోస్టాఫీసుకు సమర్పించాలి. ఖాతాదారుడు మరణిస్తే మరణించిన తేదీ నుంచి పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా చొప్పున వడ్డీ చెల్లిస్తారు. జీవిత భాగస్వామి జాయింట్ హోల్డర్ లేదా ఏకైక నామినీ అయితే ఈ పథకం కింద ఖాతా తెరవడానికి జీవిత భాగస్వామికి అర్హత ఉంటే నామినీ ఖాతాను కొనసాగించవచ్చు.
పన్ను మినహాయింపు:
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్80C కింద ప్రయోజనాలు పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి