Wedding Called Off: చెన్నైలో కుళ్లిన మాంసం సరఫరా.. బిర్యానీ లేదంటూ పెళ్ళిని వాయిదా వేసిన కుటుంబ సభ్యులు

ఓ ఇంట్లో అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బంధు మిత్రులందరూ చేరుకున్నారు. మంచి బిర్యానీతో అతిథులకు విందు భోజనం అర్డర్ ఇచ్చారు. అంతా ఒకే అనుకున్నారు. ఇంతలోనే పెళ్లి ఆగిపోయింది.

Wedding Called Off: చెన్నైలో కుళ్లిన మాంసం సరఫరా.. బిర్యానీ లేదంటూ పెళ్ళిని వాయిదా వేసిన కుటుంబ సభ్యులు
Stale Meat In Tamil Nadu
Follow us
Surya Kala

|

Updated on: May 24, 2022 | 10:40 AM

Wedding Called Off: పెళ్లంటే సందడి. విందు వినోదం.. రెండు కుటుంబాలు ఒకటిగా యువతీయువకుడిని వివాహ బంధంతో ఒకటిగా చేసే శుభతరుణం. బంధుమిత్రులు, స్నేహితులు సన్నిహితులు అందరూ కలిసే చోటు.. దీంతో తమ ఇంట పెళ్లిని ఘనంగా చేయడానికే ప్రాముఖ్యత నిస్తారు. అలా ఓ ఇంట్లో అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బంధు మిత్రులందరూ చేరుకున్నారు. మంచి బిర్యానీతో అతిథులకు విందు భోజనం అర్డర్ ఇచ్చారు. అంతా ఒకే అనుకున్నారు. ఇంతలోనే పెళ్లి ఆగిపోయింది. ఇంతకీ కారణం ఏమంటే.. బిర్యానీ లేదని.. ఈ ఘటన తమిళనాడు(Tamilandu) రాష్ట్రంలో జరిగింది. అన్‌లైన్ ఫుడ్ సరఫరా చేసే జోమాటో నిర్వాహకానికి ఆ కొత్త జంట ఒక్కటి కాలేకపోయారు.

తమిళనాడులోని ఓరథనాడులో పెళ్లికి నాన్ వెజ్ బిర్యానీ కోసం ఆర్డర్ తీసుకున్నారు సేలం ఆర్ ఆర్ బిర్యానీ సెంటర్ నిర్వహకులు. జొమాటో ద్వారా 3,500 కిలోల మాంసం సరఫరాచేసింది. ఇందుకు కావల్సిన మటన్, చికెన్‌ను బెంగళూరు నుంచి తమిళనాడుకి పార్సెల్ చేసింది జొమాటో. ఆన్‌లైన్ ఆర్డర్‌లో టన్నులలో కుళ్లిపోయిన మాంసం రావడంపై పెళ్లి బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులకు పిర్యాదు చేశారు. దీంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు కుళ్లిన మాంసంగా నిర్ధారించారు. సేలం ఆర్ ఆర్ బిర్యానీ, జొమాటో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. అటు, బిర్యానీ లేకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకున్నట్లు ఇరువురి కుటుంబసభ్యులు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..