AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mallikarjun Mutya: మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు..

యాదగిరి జిల్లాలో స్వయం ఘోషిత దేవమానవుడు మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు నమోదు కావడం సంచలనం రేపింది. ఒక బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన సమయంలో అక్కడున్న భక్తులు ఎవరూ అడ్డుకోకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Mallikarjun Mutya: మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు..
Mallikarjun Mutya
Ram Naramaneni
|

Updated on: Feb 27, 2026 | 7:48 AM

Share

కర్నాటక యాద్గిరి జిల్లాలో స్వయం ప్రకటిత దైవాంశ సంభూతుడు, ముఖం చూసి.. పేరు, తల్లిదండ్రులు పేర్లు, ఫోన్ నంబర్ చెప్పగలను అంటూ బీరాలు పలుకుతూ హడావిడి పర్సన్ మల్లికార్జున ముత్యాకు మూడింది. తాజాగా ఆయనపై పోక్సో కేసు నమోదైంది. బాలికతో అనుచితంగా ప్రవర్తించారంటూ.. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో శహపుర తాలూకా గోగి పోలీస్ స్టేషన్‌లో ముత్యాపై కేసు నమోదు చేశారు. బాలికతో అతను ఇబ్బందికరంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో వైరల్ అవుతున్నాయి. అతను చిన్నారితో అసభ్యంతో ప్రవర్తిస్తున్న సమయంలో చుట్టూ చాలామంది ఉన్నారు. కానీ ఒక్కరు కూడా అతనికి అడ్డు చెప్పకపోవడం గమనార్హం. మరోవైపు బాలల రక్షణ కమిషన్‌ కూడా ఈ ఘటనపై సీరియస్ అయింది. పోలీసుల నుంచి పూర్తి రిపోర్ట్ తెప్పించుకుంది.

అయితే ఘటనపై ముత్యా వివరణ ఇచ్చాడు. తాను ఆ బాలికను కుమార్తెలా భావించి.. సరదాగా ఆట పట్టించినట్లు చెప్పుకొచ్చాడు. తనకు ఏ చెడు ఉద్దేశం లేదని.. ఒక కుమార్తెను తండ్రి చూసేలా.. తాను ఆ చిన్నారిని చూసినట్లు వివరించాడు. దీనిపై పోలీసులు ఆదేశిస్తే.. విచారణకు హాజరు అవుతానన్నారు.  భక్తులు ‘అప్పాజీ’  అని పిలిచుకునే ముత్యా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఆయన తెలంగాణలోని ఓ ప్రాంతంలో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా మల్లికార్జున ముత్యా బాలిక శరీరాన్ని తాకుతూ డ్యాన్స్‌ చేయడం, ముక్కు పిండడం,  గొంతు పట్టుకుని మంచం మీదకు తోయడం వంటివి వైరల్‌గా మారిన వీడియోల్లో ఉన్నాయి. ఆ పాప మైనర్ కనుక.. తన డీటేల్స్, ఫోటోలు, వీడియోలు వైరల్ చేయొద్దని టీవీ9 తెలుగు బాధ్యతాయుతంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తోంది.

Also Read: తక్కువ ఖర్చుతో కోళ్లకు మేతగా పురుగులు ఇలా తయారు చేస్కోండి 

Follow Us
విజయ్ సినిమాపై త్రిష ఆసక్తికర పోస్ట్..
విజయ్ సినిమాపై త్రిష ఆసక్తికర పోస్ట్..
మీరు ఉద్యోగం మానేశారా..? కేంద్రం నుంచి ప్రతీ నెలా అకౌంట్లోకి..
మీరు ఉద్యోగం మానేశారా..? కేంద్రం నుంచి ప్రతీ నెలా అకౌంట్లోకి..
 ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
 ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
పావు ఎకరం నుంచి నెలకు రూ.30 వేలు అర్జిస్తున్న రైతు..
పావు ఎకరం నుంచి నెలకు రూ.30 వేలు అర్జిస్తున్న రైతు..
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?