TDP Mahanadu: మహానాడులో పసందైన వంటకాలు.. ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆయనకు ఇష్టమైన ఫుడ్ మెనూ ఏర్పాటు..

టీటీడీ మహానాడు ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు హాజరయ్యే అతిధులకు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ ను అందించనుంది. ఇప్పటికే ఆహారకమిటీ రుచికరమైన వంటకాలను ఏర్పాటు చేసింది.

TDP Mahanadu: మహానాడులో పసందైన వంటకాలు.. ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆయనకు ఇష్టమైన ఫుడ్ మెనూ ఏర్పాటు..
Tdp Mahanadu 2022 Food Menu
Follow us
Surya Kala

|

Updated on: May 27, 2022 | 1:03 PM

TDP Mahanadu: ఒంగోలులో(Ongole) జరుగుతున్న టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ  మహానాడుకు ఒక ప్రత్యేక కూడా ఉంది. టీడీపీ ఆవిర్బహించి 40 ఏళ్ళు పూర్తి కావడం.. మరోవైపు ఎన్టీఆర్ జన్మించి 99 పూర్తి అయ్యి.. శత జయంతి ఉత్సవాలకు అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్న వేళ.. ఈ మహానాడు ఉత్సవాలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి రెండు రోజుల పాటు వచ్చే అతిథుల కోసం టీడీపీ భారీగా ఫుడ్ మెనూ ఏర్పాటు చేసింది.

రెండు రోజుల పాటు మహానాడుకి హాజరయ్యే అతిధులకు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ ను అందించనుంది. ఇప్పటికే ఆహారకమిటీ రుచికరమైన వంటకాలను ఏర్పాటు చేసింది. మహానాడు ప్రాంగణంలో మొత్తం 11 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 28న ఆయనకు ఇష్టమైన ప్రత్యేక మెనూను కూడా ఏర్పాటు చేశారు.

మహానాడు ప్రాంగణంరోజుకు వచ్చిన నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక వంటలు అందించనున్నారు. మొదటి రోజు 70 వేల మందికి వంటలు సిద్ధం చేస్తున్నారు. 19 రకాల వంటలతో లంచ్ ఏర్పాటు చేయగా.. 11 రకాలతో రాత్రి డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. మూడు ప్రాంతాల స్పెషల్స్ వంటలతో భోజనాల ఏర్పాటు చేస్తున్నారు.

మొదటి రోజున కొబ్బరి అన్నం , బిర్యానీ, వైట్ రైస్,  రైతా సహా మామిడికాయ పప్పు, వంకాయ పకోడి ఫ్రై, మునగకాయ డబుల్ బీన్స్ కర్రీ, బీరకాయ శనగపప్పు కూర, వంకాయ పకోడి ఫ్రై లతో పాటు యాపిల్ హల్వా, జిలేబీ స్వీట్స్ ను  దోసకాయ వంకాయ చట్నీ, మామిడికాయ పచ్చడిలతో పాటు చిప్స్, అప్పడాలు, సాంబారు, పచ్చిపులుసు, మజ్జిగచారు,  నెయ్యి, పెరుగు, ఐస్ క్రీమ్ వంటివి అతిధులకు వడ్డించనున్నారు. ఇక స్నాక్స్ గా  మైసూర్ పాక్, సమోసా , పకోడి, టీ, కాఫీలను అందించనున్నారు. రాత్రి భోజనంలో  టమోటా పప్పు, బంగాళదుంప ఫ్రై, లతో పాటు సేమ్యా కేసరి, అరటికాయ భజ్జీలను, చట్నీ, పప్పుచారు, అప్పడాలు, వడియాలను అందించనున్నారు.

ఇక రేపు మే 28 ఎన్టీఆర్ పుట్టిన సందర్భంగా మహానాడుకి లక్షమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయనకు ఇష్టమైన ప్రత్యేక మెనూ ఏర్పాటు చేస్తున్నారు.

రేపు ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, గారె, పొంగల్ లను కొబ్బరి, అల్లం చట్నీలతో పాటు కారప్పొడి, నెయ్యి, సాంబారులను అందించనున్నారు. నేరేడు హల్వాని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక టీ, కాఫీలను కూడా ఇవ్వనున్నారు.

రేపు మధ్యాహ్నం భోజనంలో రైస్ ఐటెమ్స్ తో పాటు.. వెజ్ జైపూర్ కుర్మా, రైతా, దోసకాయ పప్పు, దొండకాయ పకోడి ఫ్రై లేదా బెండకాయ కొబ్బరి ఫ్రై, అరటికాయ గ్రేవీ కర్రీ, గోంగూరలను అందించనున్నారు. ఇక  ఉల్లిపాయ చట్నీ, మిక్సుడ్ వెజిటబుల్ చట్నీలు , చక్కెర పొంగలి, తాపేశ్వరం కాజా స్వీట్స్,  మసాల వడ లేదా మిర్చి భజ్జీ లేదా పుదీనా ఫింగర్ ను, డైమండ్ చిప్స్, అప్పడాలు, సాంబారు, పచ్చిపులుసు, నెయ్యి, పెరుగులను ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..