Heat Waves: తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. కొన్ని ప్రాంతాల్లో ఉక్కబోత.. మరికొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు..
ఆంధ్రప్రదేశ్ లో, ఇటు తెలంగాణాలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరికొన్ని ప్రాంతాలు భారీ వర్షాలతో అతకుతలం అవుతున్నాయి.
Heat Waves: తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలతో ప్రజల తీవ్ర అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలూ అసాధారణంగా పెరిగాయి. వాస్తవంగా అటు ఆంధ్రప్రదేశ్ లో, ఇటు తెలంగాణాలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరికొన్ని ప్రాంతాలు భారీ వర్షాలతో అతకుతలం అవుతున్నాయి.
ఏపీలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులు క్రితం వరకూ శీతల గాలులు భారీవర్షాలు కురిశాయి. వేసవి నుంచి ఉపశమనం లభించింది. అయితే ఇప్పుడు వాతావరణంలో మార్పులు వచ్చాయి. వెళ్లిపోయాయి అనుకున్న ఎండలు మళ్లీ వచ్చాయి. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. ఎండివేడిమికి తోడు ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మళ్ళీ సోమవారం ఉష్ణోగ్రతలు పెరిగాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా షమ్మిలో నిన్న 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజుల్లో ఇదే అత్యధికం. ఇవాళ, రేపు అధిక ఉష్ణోగ్రతలతో వేడి, ఉక్కపోతలు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు పశ్చిమ భారత్ ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో పొడిగాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో.. నేడు రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు.
ఆంధ్రపదేశ్ లో రాయలసీమ ప్రాంతంలో సూర్యుడు సుర్రుమనిస్తున్నాడు. ఉదయమే ఎండవేడికి ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎండకు తోడు వడగాల్పులు మొదలయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం నాడు అనంతపురంలో 38 డిగ్రీలు, పుట్టపర్తిలో 37, హిందూపురంలో 36, ధర్మవరంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇదే పరిస్థితిలు మరో వారం రోజుల పాటు కొనసాగనున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలకు పలు సూచనలు చేస్తోన్న వైద్య శాఖ:
ఎండల తీవ్రత మరికొన్ని రోజులపాటు ఇలాగే ఉంటుందని వాతవరణ నిపుణులు చెప్పారు. ఎండల తీవ్రత ఉన్నందన ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాల్సిందిగా సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణ పొందేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. డిహైడ్రేషన్ బారిన పడకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..