AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: స్వామివారి నిజపాద దర్శనం విశిష్టత ఏమిటో తెలుసా..! శ్రీవారి కుడిచేయి కిందకు ఎందుకు చూపిస్తుందంటే..

శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం సుప్రభాత దర్శనంలో మాత్రమే పుష్పాలు, తులసిలేకుండా బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి.

Tirumala: స్వామివారి నిజపాద దర్శనం విశిష్టత ఏమిటో తెలుసా..! శ్రీవారి కుడిచేయి కిందకు ఎందుకు చూపిస్తుందంటే..
Nijapada Darshanam
Surya Kala
|

Updated on: May 24, 2022 | 10:08 AM

Share

Tirumala: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి క్షేత్రం తిరుమల తిరుపతి. ఈ క్షేత్రాన్ని సాక్ష్యాత్తు వైకుంఠంగా భావించి పూజిస్తారు. స్వామివారి మహామూర్తిని ఆమూలాగ్రం దర్శించడంతో జన్మకు సార్ధకత ఏర్పడింది అనుకుంటారు. మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అయితే శ్రీవారిని శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీనినే  నిజపాద దర్శనం అంటారు. శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం  సుప్రభాత దర్శనంలో మాత్రమే పుష్పాలు, తులసిలేకుండా బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి.

శుక్రవారం అభిషేక సేవకు ముందు.. బంగారు పాదకవచాలను పక్కకు తీసి..  స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనంగా భక్తులను ఆర్జిత సేవ దర్శనానికి అనుమతిస్తారు.  ఆనందనిలయంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే.. భక్తులకు ఒక విషయం గోచరిస్తుంది. అదేమిటంటే.. స్వామివారి కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడిచేతిని.. పాదాల వైపు చూపి.. భక్తులను దర్శించుకో.. తరిస్తావంటాడు. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు.. శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్ధమట.

శ్రీహరిని అవమానించినవీ పాదములే…  సిరి అలిగినదీ ఆ పాదముల వల్లే.. భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే.. లోకకళ్యాణము చేసినదీ ఆ పాదములే.. సిరి- హరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే..

ఇవి కూడా చదవండి

లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీవారు వైకంఠం వదిలి వెంకటాద్రి చేరిన గుర్తులు పాదాలే. మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే.. శ్రీహరి అందునా శ్రీవేంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన “ఇల” వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే.

మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీ రామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంటా అని పాడాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేసాడని చెబుతుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలితన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత వుంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడుతాయి. ఈ మధ్య అలాంటి నారాయణ పాదాలు పగిలి పాదాల నుంచి బొటనవేలు వేరుపడింది. బొటనవేలు చెదరడాన్ని చూసి.. ఇది ఏ దుశ్శకునమో అనుకున్నారందరూ.

శ్రీవారి పాదములు బ్రహ్మకడిగిన పాదములవి. శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి వుంటాయి. శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీ దేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం.. చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిసాడు.

అలా శ్రీవారి పాదములను పూజించడం శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే. శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us