Sudhama Temple: అటుకుల ప్రసాదంగా స్వీకరించి భక్తుల కోరికలు తీరుస్తున్న కృష్ణుడు ఫ్రెండ్ సుధాముడు.. ఆలయం ఎక్కడో తెలుసా..?

నిజమైన స్నేహానికి ఆదర్శం కృష్ణ, సుధాములు. అయితే శ్రీకృష్ణుడు, తన స్నేహితుడైన సుధాముడితో కలిసి పూజలను అందుకుంటున్నాడు. ఆ ఆలయం.. దేశంలో ఒకేఒక్కటి ఉంది. దానిని సుధామపురి అని పిలుస్తారు. మరి ఆలయం ఎక్కడ ఉంది.

Sudhama Temple: అటుకుల ప్రసాదంగా స్వీకరించి భక్తుల కోరికలు తీరుస్తున్న కృష్ణుడు ఫ్రెండ్ సుధాముడు.. ఆలయం ఎక్కడో తెలుసా..?
Sudama Temple
Follow us
Surya Kala

|

Updated on: May 24, 2022 | 9:39 AM

Srikrishna Sudhama Temple: స్నేహానికి చిహ్నం శ్రీకృష్ణ, సుధామలని అంటారు. అయితే శ్రీకృష్ణుడికి దేవుడిగా పూజిస్తారు. దేశ విదేశాల్లో శ్రీకృష్ణుడికి మందిరాలు కూడా ఉన్నాయి. అయితే శ్రీకృష్ణుడు, తన స్నేహితుడైన సుధాముడితో కలిసి పూజలను అందుకుంటున్నాడు. ఆ ఆలయం.. దేశంలో ఒకేఒక్కటి ఉంది. దానిని సుధామపురి అని పిలుస్తారు. మరి ఆలయం ఎక్కడ ఉంది. ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..

ఆలయం నిర్మాణం: గుజరాత్  పోర్ బందర్ లోని  ఓ గ్రామంలో కుచేలుడు పుట్టినందున.. అప్పట్లో ఆ ప్రాంతాన్ని సుదామపురి అని పిలిచేవారు.  సుదాముడు జనననం గురించి ఓ కథనం కూడా ఉంది. శ్రీ కృష్ణునిని లీలలు చూసి ఆనందించడానికే నారద మహర్షి..  మధు, కారోచన అనే దంపతులకు సుదాముడుగా జన్మించాడని చెప్తారు. సుదాముడు జన్మించిన గ్రామంలో 12 వ 13వ శతాబ్దాల మధ్య సుధామ ఆలయం నిర్మించారు. ఆ ఆలయాన్ని గ్రామస్ధులు విశాలంగా కట్టి పునరుధ్ధరించారు. ఈ ఆలయం దేశంలో సుదామునికి కట్టిన ఒకే ఒక ఆలయంగా ప్రఖ్యాతి చెందింది.

ఆలయ నిర్మాణం: రాజస్ధాన్ కు చెందిన  క్షత్రియ వంశం వారు వివాహమైన వెంటనే కొత్త దంపతులు సుదాముని ఆలయానికి వచ్చి పూజలు చేయడం ఆచారం. గర్భగుడి లో సుదాముడు..  ఎడమ ప్రక్కన సుధాముడి భార్య సుశీల, కుడిప్రక్కన శ్రీ కృష్ణుడు ఆశీనులై దర్శనమిస్తారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ‘శ్రీ సుదామపురి యాత్రా ధామ్’ అని స్వాగతం పలుకుతుంది. యాభై స్ధంభాలతో నిర్మించబడిన మహామండపం తరువాత గర్భగుడి వుంది. ప్రవేశ ద్వారం వద్ద  ద్వారపాలకుల విగ్రహాలు వుంటాయి. గర్భగుడికి మీద ఉత్తర దేశ బాణీలో ఎత్తైన విమానం కనిపిస్తుంది. ఆలయానికి చుట్టూ నందనవనం, సుదాముడు ఉపయోగించిన బావి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

పూజావేళలు: ఈ ఆలయంలో నిత్యం రాత్రి ఏడు గంటలకు సంధ్యా హారతినిస్తారు. ఇక స్వామివారికి  ‘దామాజీ తండుదల్’ (కుచేలుని అటుకులు) లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అటుకులనే భక్తులకు మహా ప్రసాదంగా అందిస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులకు సిరిసంపదలు, కోరుకున్న కోర్కెలు తీరతాయని నమ్మకం. ఇక అక్షయ తృతీయ రోజున “కుచేలుని దినం” గా ఈ సుధామాలయంలో ఉత్సవాలు జరుపుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..