AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని నియమాలున్నాయి.. అవి ఏమిటంటే..

వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో అమర్చినట్లయితే, అది జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది. మనీ ప్లాంట్‌ను ఏర్పాటుకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక సూచనలు ఇవ్వబడ్డాయి. వీటి అనుగుణంగా మనీ ప్లాంట్ ను ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

Vastu Tips: మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని నియమాలున్నాయి.. అవి ఏమిటంటే..
Vastu Tips For Money Plant
Surya Kala
|

Updated on: May 21, 2022 | 8:38 AM

Share

Vastu Tips: వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్‌కు(Money Plant) ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఒకవైపు ఇంటి అందాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. మరోవైపు ఇంట్లో లేదా బయట పెట్టడం ద్వారా అక్కడ ఉన్న ప్రతికూలతను తొలగిస్తారు. ఇంటి నుండి ప్రతికూలతను దూరంగాచేసే మనీ ప్లాంట్‌ను వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో అమర్చినట్లయితే, అది జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది. మనీ ప్లాంట్‌ను ఏర్పాటుకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక సూచనలు ఇవ్వబడ్డాయి. వీటి అనుగుణంగా మనీ ప్లాంట్ ను ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సార్లు మనీ ప్లాంట్‌ను తమకు ఇష్టమైన స్నేహితులకు, సన్నిహితులకు బహుమతిగా ఇస్తూ.. పొరపాటు చేస్తారు.  అలా మనీ ప్లాంట్ ను బహుమతిగా ఇచ్చేవారికి దానిని బహుమతిగా స్వీకరించేవారికి అది బరువు అవుతుంది. మనీ ప్లాంట్‌కు సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

మనీ ప్లాంట్‌ బహుమతి: మనీ ప్లాంట్‌ను ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. ఇది శుక్ర గ్రహానికి సంబంధించినది. కనుక మనీ ప్లాంట్ బహుమతిగా ఇస్తే.. శుక్రుడిని బాధించవచ్చు. శుక్ర గ్రహం సంతోషంగా ఉంటే ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం, శాంతి వాతావరణం నెలకొంటుంది.

మనీ ప్లాంట్ ఎక్కడ పెట్టాలి:  చాలా సార్లు ఇంటి అందాన్ని పెంచేందుకు ఇంటి బయట మనీ ప్లాంట్ పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం.. ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచాలి. ఈ మొక్క ఎండిపోయిన యెడల ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను ఏర్పాటు చేయడం ద్వారా డబ్బు ఇబ్బందులు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

ఐశ్వర్యం మనీ ప్లాంట్:  ఇంట్లో ఐశ్వర్యం పెరగడానికి మనీ ప్లాంట్ పెడతారు. అయితే మనీ ప్లాంట్ల నెల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేగంగా ఎదుగుతున్న ఈ మొక్క నేలపై విస్తరించడం ప్రారంభిస్తే, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.  ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇంట్లో ఉన్న సభ్యుల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం ఉంటుంది. కనుక మనీ ప్లాంట్ మొక్కను నెల మీదకు బదులు పైకి ఎదిగేలా తాడు లేదా కర్ర సహాయంతో పెంచుకోవాలి.

ఎండిన మనీ ప్లాంట్: మీరు నాటిన మనీ ప్లాంట్ ఏదైనా కారణం వల్ల ఎండిపోయినట్లయితే, నిరుత్సాహపడకండి.  వీలైనంత త్వరగా ఆ మొక్కను వెంటనే ఇంటి నుండి తొలగించండి. ఎండిన మనీ ప్లాంట్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మరిన్నిఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..