AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: ఘనంగా ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర.. చెల్లెలకు శ్రీవారి తరపున సారెను పంపనున్న టీటీడీ..

తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగ ఇది.  ముఖ్యంగా గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగ ఇది.

Tirupati: ఘనంగా ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర.. చెల్లెలకు శ్రీవారి తరపున సారెను పంపనున్న టీటీడీ..
Tirupati Gangamma Jatara
Surya Kala
|

Updated on: May 12, 2022 | 8:23 PM

Share

Tirupati: అన్ని గ్రామాలకూ ఉన్నట్టే హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి కూడా గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలని ప్రతీతి. తాజాగా తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగ ఇది.  ముఖ్యంగా గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగ ఇది. ఈ జాతర బుధవారం బుధవారం నుంచి ప్రారంభమైంది. తిరుపతి కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఈ జాతర జరగనుంంది. తొలిరోజు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తొలి సారెను సమర్పించారు. భూమన కుటుంబ సభ్యులకు ముస్లిము సోదరులు స్వాగతం పలికారు. కరోనా తీవ్రతతో రెండేళ్లుగా జాతర ఏకాంతంగానే నిర్వహించారు.

ఈ ఏడాది జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సప్పరాలు, కోలాటాలు, పిల్లనగ్రోవెలు, డప్పులు, సన్నాయి వాయిద్యాల మధ్య భక్తులు బైరాగివేషంలో ఆలయానికి చేరుకున్నారు.

దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలుగా గంగమ్మ జాతర జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వరస్వామి కి చెల్లెలుగా అమ్మవారికి స్వామి సారె అందుతుంది. ఆనవాయితీ ప్రకారం జాతర ప్రారంభం రోజున వర్షం కురుస్తుంది. ఆనవాయితీని అనుసరిస్తూ.. జాతర ప్రారంభమైన రోజున కూడా ఆరంభానికి శుభసూచకంగా వర్షపు జల్లులు పడ్డాయి. ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుందనడానికి ఇదో సంకేతమని స్థానికుల నమ్మకం.

ఇవి కూడా చదవండి

శ్రీ వెంటకటేశ్వర స్వామి తన గంగమ్మతల్లికి ఏటా జాతర సమయంలో టీటీడీ సారెను అందజేస్తారు. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపుకుంకుమలు, శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి ముందుగా గంగమ్మ తల్లిని దర్శించుకునేవారట.. ఇప్పటికీ కొంతమంది ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..