Vastu Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా.. తులసి మొక్కను ఈ దిశలో ఉంచితే లక్ష్మి కటాక్షామే..
వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అంతేకాదు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్మకం.

Vastu Tips: తులసి మొక్కకు హిందూమతంలో(Hindu dharma) అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనదని నమ్మకం. తులసి మొక్క(Basil Plant)) ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ తులసి మొక్క అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. సాధారణ జలుబు, ఫ్లూ, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా దీనిని ఉపయోగిస్తారు. అంతేకాదు సీజనల్ వ్యాధుల నుంచి ఉపశనం కూడా ఇస్తుంది. అయితే తులసి మొక్కను ఇంట్లో ఏర్పాటు చేసుకోవానికి వాస్తుని అనుసరించాలని అంటున్నారు. వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అంతేకాదు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తులసి మొక్క వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి.. ఏ దిక్కున ఉంచితే శ్రేయస్కరం అని తెలుసుకుందాం.
స్వచ్ఛమైన పర్యావరణం ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. తులసి మొక్క గాలిలోని విష రసాయనాలను గ్రహిస్తుందని నమ్ముతారు. దీని సువాసన వాతావరణంలో సానుకూలతను నింపుతుంది.
ప్రతికూల శక్తిని అడ్డుకుంటుంది ఈ మొక్క అనేక వైద్య ప్రయోజనాలను కలిగి ఉండటమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇది సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. దురదృష్టం ఇంట్లోకి రాకుండా చేస్తుందని నమ్మకం.




అదృష్టం తెస్తుందని: తులసి మొక్క ఇంట్లో అదృష్టాన్ని తెస్తుంది. డబ్బు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ మొక్క చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.
చెడు దృష్టి నుంచి రక్షణ: ఇంట్లో ఈ మొక్కను నాటడం ద్వారా చెడు దృష్టి నుంచి ఇంటిని రక్షిస్తుందని నమ్మకం.
కుటుంబ సంబంధాలను బలపరుస్తుంది ఇంట్లో తులసి మొక్క ఉంటే కుటుంబానికి మేలు జరుగుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. దీంతో ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు సరదాగా గడుపుతారని విశ్వాసం.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్నిఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..