- Telugu News Photo Gallery Chanakya Niti People who have these 5 qualities even enemies praise them Chanakya Teachings in Telugu
Chanakya Niti: ఏ వ్యక్తిలో అయినా ఈ 5 లక్షణాలు ఉంటే.. శత్రువులు కూడా మెచ్చుకుంటారు.. చాణుక్యుడు ఏమన్నాడంటే..?
నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే ఒక వ్యక్తికి ఉండవలసని కొన్ని లక్షణాలు, గుణాల గురించి చాణుక్యుడు నీతిశాస్త్రంలో కొన్ని అంశాలను బోధించాడు
Updated on: May 11, 2022 | 11:14 AM

Chanakya Niti - qualities: ఆచార్య చాణక్యుడి బోధనలు ఉన్నతంగా ఎదగడానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే.. నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే ఒక వ్యక్తికి ఉండవలసని కొన్ని లక్షణాలు, గుణాల గురించి చాణుక్యుడు నీతిశాస్త్రంలో కొన్ని అంశాలను బోధించాడు.

ఆచార్య చాణక్యుడు ప్రతికూలత అనేది ప్రతీ వ్యక్తికి తన సొంత శక్తిని తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుందని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తెలిపాడు. ప్రతీ వ్యక్తిలో ఉండాల్సిన 5 గుణాలను ప్రస్తావిస్తూ.. అలాంటి వ్యక్తిని అందరూ మెచ్చుకుంటారని తెలిపాడు.

ఆచార్య చాణక్యుడు జీవితంలో సంతోషం.. దుఃఖం వచ్చి పోతాయని చెప్పాడు. తన కర్తవ్యాలు, బాధ్యతలన్నింటినీ ఎవరైతే సక్రమంగా.. బాధ్యతతో నిర్వర్తిస్తారో.. ఆ వ్యక్తికి సమాజంలో గౌరవం, ప్రతిష్టలు లభిస్తాయి.

ఎన్ని అవరోధాలు వచ్చినా తన లక్ష్యం పట్ల పూర్తి అంకితభావంతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకునే వ్యక్తి ఎప్పుడూ చరిత్రలో నిలుస్తాడని తెలిపాడు. అలాంటి వ్యక్తి సమాజంలో గౌరవం పొందడమే కాకుండా, శత్రువులు కూడా అతనిని ప్రశంసిస్తారన్నాడు. అలాంటి వ్యక్తి జీవితంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధిస్తాడని పేర్కొన్నాడు.

జీవితంలో విజయవంతమైన వ్యక్తి.. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపడు. జ్ఞానాన్ని సంపాదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇతరులకు ప్రేరణగా నిలుస్తాడు. సరస్వతీ దేవీ అనుగ్రహం ఎప్పుడూ అలాంటి వారిపై ఉంటుందన్నాడు చాణుక్యుడు.

ఆచార్య చాణక్యుడి బోధనలు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే.. నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే చాణుక్యుడు ముఖ్యంగా కొందరు వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదని బోధించాడు.





























