Vastu Tips: ఆర్ధిక ఇబ్బందులా వాస్తు ప్రకారం.. లాఫింగ్ బుద్దాను ఇంట్లో ఇలా ఏర్పాటు చేసుకోండి..

లాఫింగ్ బుద్ధ ప్రాముఖ్యత చైనీస్(China) గ్రంథమైన ఫెంగ్ షుయ్‌లో ఉన్నప్పటికీ, దీని  ప్రాముఖ్యత భారతీయ వాస్తు శాస్త్రంలో కూడా చెప్పబడింది..

Vastu Tips: ఆర్ధిక ఇబ్బందులా వాస్తు ప్రకారం.. లాఫింగ్ బుద్దాను ఇంట్లో ఇలా ఏర్పాటు చేసుకోండి..
Laughing Buddha
Follow us
Surya Kala

|

Updated on: May 10, 2022 | 8:05 PM

Vastu Tips: లాఫింగ్ బుద్దాను ( Laughing Buddha) ఇంట్లో వాస్తు ప్రకారం ఉంచడం ద్వారా, జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. లాఫింగ్ బుద్ధ ప్రాముఖ్యత చైనీస్(China) గ్రంథమైన ఫెంగ్ షుయ్‌లో ఉన్నప్పటికీ, దీని  ప్రాముఖ్యత భారతీయ వాస్తు శాస్త్రంలో కూడా చెప్పబడింది. వాస్తు ప్రకారం, లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం, లాఫింగ్ బుద్ధను వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుంది. లాఫింగ్ బుద్దా డబ్బుకు సంబంధించినదని అందుకే ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు లాఫింగ్ బుద్దా సాయం చేస్తుందని నమ్మకం. ఇది మాత్రమే కాదు, ప్రజలు ఇంట్లో మాత్రమే కాదు.. వ్యాపారంలో లాభం కోసం కూడా ఆయా ప్లేసెస్ లో ఉంచుతారు. చాలా సార్లు స్నేహితులకు, పరిచయస్థులకు అదృష్టానికి చిహ్నం అంటూ బహుమతిగా ఇస్తారు.

లాఫింగ్ బుద్ధుడు..  బుద్ధుని శిష్యుడు అని జపాన్ వాసుల నమ్మకం. బుద్ధుడి నుండి విద్యను పొందే సమయంలో అతను అకస్మాత్తుగా బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. అంతేకాదు అతను ఎక్కడ ఉన్నా ప్రజలను నవ్వించడమే తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. అయితే ఇంట్లో ఎక్కడ బడితే అక్కడ  లాఫింగ్ బుద్ధ ఉంచకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లాఫింగ్ బుద్ధను ఏ దిశలో పెట్టాలి అనే విషయంపై సరైన అవగాహన కలిగి ఉండడం అవసరం. లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఎక్కడ ఉంచుకోవాలో, ఎక్కడ ఉంచకూడదో ఈరోజు తెలుసుకుందాం..

లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టె ప్లేసెస్.. లాఫింగ్ బుద్ధ విగ్రహాలు అనేక రకాలుగా అందుబాటులో ఉన్నాయి. అయితే డబ్బు కోసం ఇబ్బంది ఏర్పడితే.. ఇంట్లో డబ్బు కట్ట మోసే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి. ఈ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలని నమ్మకం. అంతేకాదు భూమి నుండి 30 అంగుళాలు లేదా గరిష్టంగా 32 అంగుళాల ఎత్తులో విగ్రహాన్ని ఉంచడం మంచిది. ఇలా చేయడం ద్వారా, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. డబ్బు ఇబ్బందులు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

లాఫింగ్ బుద్ధను పెట్టకూడని ప్లేసెస్.. చాలా సార్లు లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనే విషయంపై అవగాహన లేకుండా ఏర్పాటు చేసుకుంటారు. వాస్తు ప్రకారం.. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని వంటగదిలో, డైనింగ్ ఏరియాలో, పడకగదిలో, టాయిలెట్‌లో అస్సలు పెట్టకూడదు. ఇది ఒక రకమైన పొరపాటు, కొన్ని సార్లు ఆర్థిక ఇబ్బందులను  ఎదుర్కోవలసి ఉంటుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ