Tirumala: వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి వారపు సేవలకు తాత్కాలికంగా బ్రేక్..
Tirumala: తిరుమల తిరుపతి(Tirupati) క్షేత్రాన్ని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో భారీగా రద్దీ నెలకొంటుంది..
Tirumala: తిరుమల తిరుపతి(Tirupati) క్షేత్రాన్ని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో భారీగా రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో టీటీడీ (TTD) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Sri Venakateswara Swamy Temple) వారపు సేవలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, నిజపాద దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అయితే ఇప్పటికే ఈ సేవలకు టికెట్లను తీసుకున్న భక్తులకు ప్రత్యామ్నాయం ఏర్పాలు చేయనున్నదని.. స్వామివారి బ్రేక్ దర్శనం కల్పించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వేసవి రద్ది సమయంలో భక్తులుకు అధిక దర్శన సమయం కేటాయించడానికే వారపు సేవలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఇప్పటికే విశేష పూజ, సహస్రకళషాభిషేకం సేవలను శాశ్వతంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read:
Nayanthara-Vignesh: నయన్ విగ్నేష్‌ల పెళ్లి డేట్ ఫిక్స్?.. తిరుమలలో పెళ్లి పీటలు ఎక్కనున్న జంట..