- Telugu News Photo Gallery Spiritual photos Travel know interesting facts about uttarakhand famous temple badrinath in Telugu
Badrinath temple: 6నెలలు దేవతలతో, 6 నెలలు మానవులతో పూజలను అందుకునే నారాయణుడి క్షేత్రం..
Badrinath temple travel: బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి. బద్రినాథుడిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు బద్రీనాథ్ క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఈ క్షేత్రం అనేక రహస్యలకు నెలవు. ఈరోజు ఈ క్షేత్ర విశిష్టత గురించి తెలుసుకుందాం..
Updated on: May 10, 2022 | 8:05 PM

బద్రీనాథ్ బాబా దర్శనం కోసం ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. బద్రీనాథ్ హిందూ పురాణాలలో బద్రీ లేక బద్రికాశ్రమం గా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నర-నారాయణులు ఆశ్రమజీవితం గడిపిన ప్రదేశం. మీరు ఇక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ నారాయణుని ఆలయానికి సంబంధించిన ఈ విషయాలను గురించి తెలుసుకోండి

శీతాకాలంలో అతి శీతల వాతావరణం కారణంగా వేసవిలో మాత్రమే గుడిలో భక్తుల ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. బద్రీనాధుని దర్శించడానికి అనువైన కాలం జూన్ సెప్టెంబరుల మధ్యకాలం. జీవుడికి స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయని వాటిని జ్ఞానం వలన నశింపచేసే క్షేత్రం కనుక విశాల అనే పేరు వచ్చిందని పురాణ కథనం.

ఈ ఆలయంలో యోగ భంగిమలో ఉన్న నారాయణుడిని మానవులు ఆరు నెలలు, దేవతలు ఆరు నెలలు పూజిస్తారని చెబుతారు. ఇందులో దేవతా పూజాకాలం శీతాకాలంలో కొనసాగుతుంది.

బద్రీనాథ్ లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాధ్‌గుడి. పురాణ కథనం అనుసరించి క్రీ.శ. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పాన్ని తప్త కుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించాడు. 16వ శతాబ్దంలో గర్హ్వాలా రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు.

బద్రీక్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాలలో లేదని స్కందపురాణం చెప్తుంది. ఇది విష్ణుక్షేత్రం విష్ణువు ఏక్షేత్రం విడిచినా ఈ క్షేత్రం విడువడని ప్రతీతి. వారణాశిలో అరవైవేల సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయదర్శన మాత్రంచే కలుగుతుందని పురాణ కథనం.




