Vastu Tips: ఇంట్లో మట్టి కుండ ఉంచడం శుభప్రదం.. ఏ దిశలో ఏర్పాటు చేసుకుంటే.. కుబేరుని అనుగ్రహం కలుగుతుందంటే..

వాస్తు శాస్త్రం ప్రకారం (Vastu tips in telugu) .. మట్టితో చేసిన ఈ వస్తువులను నిబంధనల ప్రకారం ఉపయోగిస్తే, డబ్బు ఇబ్బందులు తీరతాయి. చేపట్టిన పనుల్లో విజయం సొంతమవుతుంది. 

Vastu Tips: ఇంట్లో మట్టి కుండ ఉంచడం శుభప్రదం.. ఏ దిశలో ఏర్పాటు చేసుకుంటే.. కుబేరుని అనుగ్రహం కలుగుతుందంటే..
Vastu Tips
Follow us

|

Updated on: May 11, 2022 | 8:38 PM

Vastu Tips: ఒకప్పుడు, ప్రజలు తమ ఇళ్లలో చల్లటి నీరు త్రాగడానికి నీటి కోసం మట్టితో చేసిన కుండ లేదా కూజాను (mud things for water ) ఉపయోగించేవారు. ఇప్పుడు చాలా అరుదుగా ఇళ్లలో మట్టి కుండలు కనిపిస్తాయి, ఎందుకంటే ప్రజలు రిఫ్రిజిరేటర్లు, కూలింగ్ ఫిల్టర్లు , సీసాలు తమ జీవితంలో భాగంగా చేసుకున్నారు. అయితే మట్టితో తయారు చేయబడిన కుండలను ఉపయోగించడం వలన ప్రయోజనం ఏమిటంటే..  ఇవి ఆరోగ్యానికి  మేలు చేస్తాయి. అంతేకాదు వాస్తు, జ్యోతిష్యానికి సంబంధించిన లాభాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా . వాస్తు శాస్త్రం ప్రకారం (Vastu tips in telugu) .. మట్టితో చేసిన ఈ వస్తువులను నిబంధనల ప్రకారం ఉపయోగిస్తే, డబ్బు ఇబ్బందులు తీరతాయి. చేపట్టిన పనుల్లో విజయం సొంతమవుతుంది.  ఈరోజు మట్టి కుండ లేదా కూజా వల్ల కలిగే ప్రయోజనాలు.. వాటి వినియోగానికి సంబంధించిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం..

కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ: వాస్తు ప్రకారం, ఇంట్లో ఉంచిన మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఏర్పడుతుంది. మట్టి కుండలోని నీరు మంచి వాసనతో పాటు రుచిగా ఉంటుంది. కుటుంబ సభ్యులు పరస్పరం సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు.

గ్రహ స్థానాలు: మట్టితో చేసిన వస్తువులు జ్యోతిష్య పరిహారాలకు ఉపయోగిస్తారని మీకు తెలుసా. గ్రహాలను నియంత్రించడానికి.. మట్టి వస్తువులు ఉపయోగపడతాయని ప్రజలు నమ్ముతారు. ఇంట్లో మట్టి కుండను ఉంచినట్లయితే, జ్యోతిషశాస్త్రం ప్రకారం, అది బుధుడు , చంద్రుని స్థానాన్ని బలపరుస్తుంది. అంతేకాదు.. మట్టి కుండను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు.

ఇవి కూడా చదవండి

వాస్తు నియమాలు:  మట్టి కుండల గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. మీరు ఇంట్లోకి మట్టి కుండను తీసుకు వచ్చిన తర్వాత ముందుగా ఇంట్లోని ఏ పిల్లలకైనా అందులో నీటిని నింపి ఇవ్వండి. ఈ పద్దతి వల్ల ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుందని, పూర్వీకుల ఆశీస్సులు కూడా ఉంటాయని నమ్మకం.

నీటి కుండను పెట్టే దిశ: మీరు ఇంట్లో కొత్తగా కుండను తెచ్చుకున్నట్లు అయితే.. వాస్తు ప్రకారం సరైన దిశలో ఏర్పాటు చేసుకోండి. కుబేరునికి ఉత్తర దిక్కు చాలా ప్రీతికరమైంది. అందుకే మట్టి కుండను ఉత్తరం వైపు ఉంచాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదని.. ఆర్ధిక ప్రయోజనాలు పొంద వచ్చు అని చెబుతున్నారు. కుబేరుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్నిఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..