Vastu Tips: ఇంట్లోని పూజగదిలో ఈ 5 వస్తువులు ఉంచితే అశుభం, మీ ఇంట్లో ఉంటే ఈరోజే తీసేయండి..
Vastu Tips: మీ ఇంట్లో పూజ గది ఉంటే మీరు కూడా ఈ నియమాలను అనుసరిస్తున్నారో లేదో ఒకసారి చూడండి. ఒకవేళ పూజ గదిలో ఇలాంటివి ఉంచితే వెంటనే తీసేయండి. పూజకు సంబంధించిన నియమాలను తెలుసుకోండి.
Vastu Tips: హిందువుల ప్రతి ఒక్కరి ఇంటిలో పూజ గది ఉంటుంది. తమకు ఇష్టమైన దేవతల చిత్ర పటాలను ఉంచి ఇంటి సభ్యులు పూజిస్తారు. అయితే హిందూ మతంలో పూజకు సంబంధించిన కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ఎవరైనా సరే దేవుడిని పూజించే సమయంలో ఈ నియమాలను పాటించాలి. ముఖ్యంగా పూజ గదిలో ఆరు వస్తువులను ఉంచకూడదనిసూచించారు. ఇలా చేయడం వలన దేవుడికి కోపం వస్తుందని నమ్ముతారు. మీ ఇంట్లో పూజ గది ఉంటే మీరు కూడా ఈ నియమాలను అనుసరిస్తున్నారో లేదో ఒకసారి చూడండి. ఒకవేళ పూజ గదిలో ఇలాంటివి ఉంచితే వెంటనే తీసేయండి. పూజకు సంబంధించిన నియమాలను తెలుసుకోండి(Rules for Worship).
పూజ సమయంలో చేయకూడని తప్పులు ఏమిటంటే.. ఇంటి పూజ గదిలో దేవుడి విగ్రహాలను ఒకటి కంటే ఎక్కువ ఉంచకూడదు. లేదా ఆ దేవుడి పటాల సంఖ్య 3, 5, 7 సంఖ్యలో ఉండకూడదని గుర్తుంచుకోండి.
చాలామంది ఇంటి పూజగదిలో శివలింగాన్ని ఉంచుతారు. అయితే శివలింగాన్నీ ఇంట్లో పూజించడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఉండకూడదని శివపురాణంలో చెప్పబడింది. శివలింగం నుండి శక్తి అన్ని సమయాల్లో ప్రసారం అవుతుంది. కాబట్టి.. శివలింగాన్ని ఎల్లప్పుడూ బహిరంగ ప్రదేశంలో ఉంచాలి. అంతేకాదు శివలింగం పరిమాణం బొటనవేలు పరిమాణం కంటే ఎప్పుడూ పెద్దదిగా ఉండకూడదు.
ఇంటి పూజ గదిలో ఉంచే దేవుడి చిత్ర పటాలను ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేలా చూసుకోవాలి. కోపంగా ఉన్న పటాలను ఉంచడం అశుభకరంగా, చిరునవ్వుతో ఉన్న చిత్రాన్ని శుభంగా పరిగణిస్తారు. అంతేకాదు నవ్వుతు ఉన్న దేవుడి చిత్ర పటాలు ఇంట్లో సానుకూలతను తెస్తాయి.
పూజ గదిలో దేవుడి విగ్రహం లేదా పటం విరిగినా, చిరిగిన వాటిని పూజకు ఉపయోగించవద్దు. విరిగిన లేదా పగిలిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం అశుభం. ఇది వాస్తు దోషాలకు దారి తీస్తుంది. అలాంటివి ఏమైనా ఇంట్లోని పూజ గదిలో ఉంటె వెంటనే వాటిని పూజ గది నుంచి వెంటనే తొలగించండి.
పూజ సమయంలో అక్షతలు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నాయి. ఈ అక్షతలు పూజలో పువ్వులు లేని లోటును కూడా తీరుస్తాయి. అయితే ఈ అక్షతల తయారీకి విరిగిన బియ్యం ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇలా చేయడం అశుభంగా పరిగణించబడుతుంది. కనుక ఇంటి పూజ గదిలో విరిగిన బియ్యంతో అక్షతలు ఉంటే వాటిని ఈరోజే తీసేసి బియ్యంతో అక్షతలు తయారీ చేసుకోండి.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..