Horoscope Today: ఆ రాశుల వారు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.. ఈ రోజు రాశి ఫలాలు..
జీవితంలో కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను (Horoscope) అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం (మే 24న ) రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
Today Horoscope: జీవితంలో కొంతమంది ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటారు. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను (Horoscope) అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం (మే 24న ) రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
మేషం: ఈ రాశి వారు తీసుకునే కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. నిబద్ధత, పట్టుదలతో అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.
వృషభం: శ్రమకు తగిన గుర్తింపు లభించడంతోపాటు అనుకున్న పనులు పూర్తవుతాయి. శుభవార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సాయం లభిస్తుంది.
మిథునం: ఈ రాశి వారు ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. తీసుకునే నిర్ణయాలు, సన్నిహితుల వల్ల ఆకస్మిక ధన వ్యయం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం: చేపట్టిన పనుల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరిగే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సమయానికి డబ్బు లభిస్తుంది.
సింహం: ఈ రాశి వారికి శుభకాలం. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాలు అనుకూలిస్తాయి. కుటుంబం నుంచి సాయం అందుతుంది.
కన్య: ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. సకాలంలో పనులను పూర్తిచేస్తారు. ప్రణాళికలతో ముందుకు సాగడం మంచిది. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.
తుల: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం: ఈ రాశి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తీసుకోవడం మంచిది. కొందరి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇబ్బందులను అధిగమించేందుకు కుటుంబసభ్యుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
మకరం: చేపట్టిన పనిలో కుటుంబసభ్యుల నుంచి సాయం లభిస్తుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వాదనలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
కుంభం: ప్రారంభించిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై దృష్టిసారించాలి.
మీనం: కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల నుంచి సాయం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు ఫలిస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..