TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. కాసేపట్లో అందుబాటులోకి ఆర్జిత సేవ టికెట్లు..

TTD News: కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో అన్ని రకాల సేవలకు భక్తులను అనుమతిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ అధికారులు ఆర్జిత సేవా టికెట్లను...

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. కాసేపట్లో అందుబాటులోకి ఆర్జిత సేవ టికెట్లు..
TTD
Follow us

|

Updated on: May 24, 2022 | 6:35 AM

TTD News: కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో అన్ని రకాల సేవలకు భక్తులను అనుమతిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ అధికారులు ఆర్జిత సేవా టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు (మంగళవారం) ఉదయం 9 గంటలకు అందుబాటులోకి తేనున్నారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో భక్తులు టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు.

దీంతో పాటు ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన సుప్రభాతం, తోమాల‌, అర్చన‌, జులై నెల‌కు సంబంధించిన అష్టద‌ళ‌ పాద‌ ప‌ద్మారాధ‌న సేవ టికెట్లను ఈరోజు (మంగళవారం) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల చేయనున్నారు. మే 26వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు భ‌క్తులకు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అనంతరం 26వ తేదీ సాయంత్రం 6 గంట‌లకు ఆన్‌లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన భక్తులకు స‌మాచారం అందిస్తారు.

భ‌క్తులు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే జులై, ఆగ‌స్టు నెల‌ల‌కు సంబంధించిన వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజ‌ల్‌ సేవ‌, స‌హ‌స్రదీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ మే 25వ తేదీ ఉద‌యం 9 గంట‌ల నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు