గోంగూర మష్రూమ్ కర్రీ.. ఇలా వండితే గిన్నెలు కూడా మిగలవు 

Prasanna Yadla

15 March 2026

Pic credit - Pixabay

గోంగూర మష్రూమ్ కర్రీ ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా తింటారు. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.. 

గోంగూర మష్రూమ్ కర్రీ

పావుకిలో మష్రూమ్స్ , ఒక గోంగూర కట్ట,  మూడు పెద్ద ఉల్లిపాయలు,  4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్, కారం, అర టీ స్పూన్  పసుపును తీసుకోవాలి. 

కావాల్సిన పదార్ధాలు

రుచికి సరిపడా ఉప్పు, పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, మూడు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు

రుచికి సరిపడా ఉప్పు, పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, మూడు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోవాలి.

స్టెప్ - 1

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్‌లో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి బాగా వేయించండి. 

స్టెప్ - 2

అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి రంగు మారే వరకు వేయించండి.

స్టెప్ - 3

ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులకు అర టీ స్పూన్ పసుపు, రుచికి సరి పడా ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. 

స్టెప్ - 4

రెండు టేబుల్ స్పూన్స్  కారం, ముందుగా పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ ను వేసి బాగా కలుపుకోండి. దీనిలో  కొద్దిగా నీళ్లు పోసి 10  నిమిషాల పాటు బాగా పెట్టి ఉడికించండి.చివర్లో కొత్తిమీర చల్లి దించేయడమే.

స్టెప్ - 5