AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం శ్రీలీల రెమ్యునరేషన్.. ఫ్లాపుల్లో ఉన్నా అంత తీసుకుందా.!!

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవర్ స్టార్ మేనియాతో ఊగిపోతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది కానుకా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కు అభిమానుల నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం శ్రీలీల రెమ్యునరేషన్.. ఫ్లాపుల్లో ఉన్నా అంత తీసుకుందా.!!
Ustaad Bhagat Singh
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2026 | 2:53 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మార్చ్ 19న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది. గతంలో హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే హీరోయిన్స్ గా శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. తమన్ బీజీఎం స్కోర్ అందించారు.

ఇదిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం హీరోయిన్ శ్రీలీల రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీల ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా రాశీ ఖన్నా నటిస్తుందని తెలుస్తుంది. కాగా ఈ సినిమా కోసం శ్రీలీల ఏకంగా రూ. 2.5 నుంచి రూ. 3కోట్ల వరకు తీసుకుంటుందని తెలుస్తుంది. గతంలో శ్రీలీల జూనియర్ అనే సినిమా కోసం రూ. 4 కోట్లు తీసుకుందట.

ఇక ఇప్పుడు ఉస్తాద్ కోసం కూడా ఈ అమ్మడు భారీగానేఅందుకుంటుందని తెలుస్తుంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా శ్రీలీల నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. మధ్యలో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా హిట్ అయినప్పటికీ అది బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తుంది శ్రీలీల.. ఈ సినిమా భారీ హిట్ పక్కా అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us