Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త. ప్రభుత్వం డబ్బులు అకౌంట్లలో జమ చేసింది. ఇల్లు నిర్మించుకుంటున్నవారికి నాలుగు విడతలుగా ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. అందులో భాగంగా తాజాగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది. ఇవి లబ్దిదారుల అకౌంట్లలో ఇప్పటికే జమ అయ్యాయి.

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇళ్లు మంజూరై నిర్మించుకుంటున్న లబ్దిదారులకు తాజాగా నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెండింగ్ బిల్లులను చెల్లించింది. వీటిని నేరుగా లబ్దిదారుల అకౌంట్లో జమ చేసింది. ఈ దశలో మొత్తం 2,764 మంది లబ్దిదారులకు రూ.28.50 కోట్లు మంజూరు చేసింది. 99 రోజుల కార్యక్రమాన్ని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన వారం రోజుల్లో లబ్దిదారులకు నిధులు విడుదల చేసింది. లబ్దిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గౌతం ప్రకటించారు. అకౌంట్లలోకి డబ్బులు విడుదల కావడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
పెండింగ్ బిల్లులు క్లియర్
పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు చర్యలు చేపడుతోంది. దీని వల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అవుతాయని భావిస్తోంది. సాంకేతిక సమస్యల వల్ల డబ్బలు జమ కాని లబ్దిదారులకు కూడా అందించేందకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. గత వారం రోజుల్లో ఎల్-3 జాబితాలో ఉన్న 1200 మందికి రూ.12.06 కోట్లు విడుదల చేశారు. ఇక బ్యాంక్ వద్ద పెండింగ్‌లో ఉన్న 653 మందికి కూడా రూ.7 కోట్లు విడుదల చేశారు. ఇక అభ్యంతరాల తర్వాత పెండింగ్‌లో పడ్డ 911 మంది లబ్దిదారులకు కూడా రూ.9.40 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్‌లో రెండో విడత
తొలి విడతలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ఇక రెండో విడత జాబితాను త్వరలో ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్‌లో రెండో విడత జాబితా కింద మరికొంతమందిని ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ పథకం కింద స్థలం ఉంది ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తోంది. నాలుగు విడతలుగా లబ్దిదారుల అకౌంట్లలో వీటిని జమ చేస్తోంది. కాగా తొలి విడత జాబితాలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేశారు.
