ఏకంగా పోలీస్ అధికారికే ఉచ్చు బిగించిన సైబర్ కేటుగాళ్లు.. ఆలస్యంగా వెలుగులోకి..
ఇప్పటిదాకా ఎన్నో సైబర్ నేరాలు చూశాం. సామాన్యులతో పాటు ప్రముఖు మోసం చేసిన ఎన్నో కేసుల గురించి విన్నాం. ఇందుకు సంబంధించి కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి కేటుగాళ్ల తాట తీస్తారు పోలీసులు. అలాంటిది.. సామాన్యులునే కాదు, చివరికి పోలీసు శాఖ అధికారులనూ వదలడం లేదు సైబర్ కేటుగాళ్లు. ఇటీవల ఓ ASIని టార్గెట్ చేసిన మాయాగాళ్లు ఉచ్చు బిగించారు.

ఇప్పటిదాకా ఎన్నో సైబర్ నేరాలు చూశాం. సామాన్యులతో పాటు ప్రముఖు మోసం చేసిన ఎన్నో కేసుల గురించి విన్నాం. ఇందుకు సంబంధించి కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి కేటుగాళ్ల తాట తీస్తారు పోలీసులు. అలాంటిది.. సామాన్యులునే కాదు, చివరికి పోలీసు శాఖ అధికారులనూ వదలడం లేదు సైబర్ కేటుగాళ్లు. ఇటీవల ఓ ASIని టార్గెట్ చేసిన మాయాగాళ్లు ఉచ్చు బిగించారు. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి, అతని నుంచి రూ.95,500 తమ బ్యాంకు ఖాతాలో మళ్లించుకున్నారు. జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జగిత్యాల జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సైకి ఇటీవల ఓ వీడియో కాల్ వచ్చింది. తాను మాట్లాడిన వీడియోను రికార్డు చేసిన సైబర్ నేరగాళ్లు.. కొద్దిసేపటికే మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని ఏఎస్సైను బెదిరించారు. దీంతో భయపడిన సదరు ఏఎస్సై మూడు విడుతలుగా రూ.95,500 సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమచేశాడు. చివరికి మోసపోయానని తెలుసుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
చివరికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. చాలా మంది ఇదే విధంగా మోసపోతున్నారు. వివిధ ఫోన్ నంబర్స్ కాల్ చేసి బెదిరిస్తున్నారు. ఎవరైనా పరిచయం లేని వ్యక్తులు, వివరాలు అడుగుతే ఇవ్వకూడదని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
