AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!

బీఆర్ఎస్ పార్టీ నేత రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్‌కు పాజిటివ్ వచ్చినట్లు ఈగల్‌ టీమ్ పోలీసులు వెల్లడించారు. తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న నార్కోటిక్ అధికారులు దాడి నిర్వహించారు.

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
Eluru Tdp Mp Putta Mahesh
Balaraju Goud
|

Updated on: Mar 15, 2026 | 10:16 AM

Share

బీఆర్ఎస్ పార్టీ నేత రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్‌కు పాజిటివ్ వచ్చినట్లు ఈగల్‌ టీమ్ పోలీసులు వెల్లడించారు. తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న నార్కోటిక్ అధికారులు దాడి నిర్వహించారు. ఈ పార్టీలో ఆంధ్రప్రదేశ్ గోదావరీ జిల్లాకు చెందిన ఎంపీ పుట్ట మహేష్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇవాళ నిర్వహించిన టెస్ట్‌లో ఎంపీకి డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చినట్లు ఈగల్‌ ఎస్పీ గిరిధర్ తెలిపారు. పుట్ట మహేష్ తోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన కీలక వివరాలను రంగారెడ్డి ఎస్పీ గిరిధర్ మీడియాకు వెల్లడించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. శనివారం (మార్చి 14) నిర్వహించిన టెస్ట్‌లో పుట్టా మహేష్‌కు నెగెటివ్‌ వచ్చింది. అయితే ఇవాళ నిర్వహించిన టెస్ట్‌లో ఎంపీకి డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చిందనిఈగల్‌ ఎస్పీ తెలిపారు. శరీర మెటబాలిజమ్‌ బట్టి రిపోర్టులో వ్యత్యాసం ఉందని ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌ వెల్లడించారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్‌ తీసుకుంటే చర్యలు తప్పవని ఎస్పీ గిరిధర్‌ హెచ్చరించారు.

తాండూరు పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న వారిలో 11 మందికి డ్రగ్స్ టెస్ట్‌లు చేసినట్లు ఈగల్ టీమ్ పోలీసులు తెలిపారు. శరీర మెటబాలిజమ్‌ బట్టి రిపోర్టులో రోహిత్‌రెడ్డి, పుట్టా మహేష్ సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఈ మేరకు డ్రగ్స్‌ పార్టీపై మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్‌‌లో FIR నమోదు అయ్యింది. కౌశిక్‌ రవి అనే వ్యక్తి సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. బెంగళూరుకు చెందిన కౌశిక్‌ రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు తెలిపారు. గతంలో ఎన్నిసార్లు పార్టీలు జరిగాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
చీపురు కట్ట, చెత్త బుట్ట ఈ దిశలో పెడితే అదృష్ట ద్వారం ఓపెన్
చీపురు కట్ట, చెత్త బుట్ట ఈ దిశలో పెడితే అదృష్ట ద్వారం ఓపెన్
మార్చి 20 లేదా 21.. రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..
మార్చి 20 లేదా 21.. రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..
'హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలను పంపండి..': ట్రంప్
'హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలను పంపండి..': ట్రంప్
మారిన వందే భారత్ రైళ్ల టైమింగ్స్..
మారిన వందే భారత్ రైళ్ల టైమింగ్స్..
ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్
ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్
క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువులకు వణుకే
క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువులకు వణుకే