- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips get rid of health diseases follow these astro tips in telugu
Astro Tips: కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారా.. ఈ వాస్తు చిట్కాలను పాటించిచూడండి.
Astro Tips: ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో డాక్టర్ చికిత్సతో పాటు కొన్ని జ్యోతిష్యం, వాస్తు నివారణ చర్యలను కూడా ప్రయత్నించండి.
Updated on: May 24, 2022 | 9:35 AM

ప్రస్తుతం జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎవరైనా అనారోగ్యానికి గురైతే, డాక్టర్ చికిత్సతో పాటు, మీరు కొన్ని జ్యోతిష్యం మరియు వాస్తు నివారణలను ప్రయత్నించవచ్చు. మీరు ఏ రెమెడీలను ప్రయత్నించవచ్చో తెలుసుకుందాం.

కుటుంబంలోని ఎవరైనా అనారోగ్యంతో ఉండి.. కోలుకోలేకపోతే.. ఒక పాత్రలో నిండుగా నీరు నింపి.. దానిని అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పై తల చుట్టూ మూడు సార్లు తిప్పి అనంతరం ఆ నీటిని రావి చెట్టుకు సమర్పించండి.ఇలా 3 రోజులు చేయడం వలన త్వరలోనే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఒక వ్యక్తి దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉంటే.. అతను దక్షిణ దిశలో పడుకోవాలి. జబ్బుపడిన వ్యక్తి మందులు, నీటిని కూడా దక్షిణ దిశలో ఉంచండి. ఒక వ్యక్తి ఔషధం తీసుకునే సమయంలో అతని ముఖం తూర్పు వైపు ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల రోగి చాలా త్వరగా కోలుకుంటాడు.

దానం చేయడం వలన మంచి జరుగుతుందని నమ్మకం. ఎవరికైనా అవసరమైన పండ్లు, మందులను దానం చేయండి. దీంతో రోగికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇలా చేయడం వల్ల రోగికి రోగాలు తగ్గుతాయి.

మీ ఇంటి ముందు గొయ్యి ఉంటే పూడ్చండి. ప్రధాన ద్వారం ముందు మురికిని ఉంచవద్దు. దీని వల్ల ఇంట్లోని వారు వ్యాధుల బారిన పడతారు. ఇంటి విషయంలో పరిశుభ్రత గురించి జాగ్రత్తలు తీసుకుంటే రోగి చాలా త్వరగా కోలుకుంటాడు.

ఇక్కడ ఇచ్చిన సమాచారం వ్యక్తి నమ్మకం ఆధారంగా ఇచ్చింది శాస్త్రీయ ఆధారం లేదు




