- Telugu News Photo Gallery Spiritual photos These are rules of rudraksha wearing lord shiva mantra check here in telugu
Rules For Rudraksha : రుద్రాక్షలను ధరిస్తున్నారా ?.. అయితే ముందు ఈ నియమాల గురించి తెలుసుకున్నారా ?..
రుద్రాక్ష.. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. శివుని కన్నీటితో ఈ రుద్రాక్ష జన్మించిందని.. రుద్రాక్ష ఒక ముఖం నుంచి ఇరవై ఒక్క ముఖం వరకు ఉంటుంది. వీటన్నింటికి భిన్నమైన ప్రాముఖ్యతలు ఉన్నట్లు చెబుతుంటారు. కానీ అన్ని రకాల రుద్రాక్షలను ధరించే ముందు కొన్ని నియమాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
Updated on: May 24, 2022 | 6:10 PM

రుద్రాక్ష.. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. శివుని కన్నీటితో ఈ రుద్రాక్ష జన్మించిందని.. రుద్రాక్ష ఒక ముఖం నుంచి ఇరవై ఒక్క ముఖం వరకు ఉంటుంది. వీటన్నింటికి భిన్నమైన ప్రాముఖ్యతలు ఉన్నట్లు చెబుతుంటారు. కానీ అన్ని రకాల రుద్రాక్షలను ధరించే ముందు కొన్ని నియమాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

చాలా మంది రుద్రాక్షలను నల్లదారంతో ధరిస్తారు.. కానీ నియమాల ప్రకారం అది చాలా పెద్ద తప్పు.. రుద్రాక్షను ఎప్పుడు ఎరుపు లేదా పసుపు దారంతో మాత్రమే ధరించాలి.. అంతేకాకుండా.. గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాతే ధరించాలి.

రుద్రాక్ష ధరించేటప్పుడు శివుని మంత్రం.. ఓం నమః శివాయ జపించాలి. అలాగే రుద్రాక్ష స్వచ్చతపై పూర్తి శ్రద్ద వహించాలి. పీరియడ్స్ సమయంలో స్త్రీలు తీసేసి.. ఆ తర్వాత గంగాజలంతో శుద్ధి చేసి మళ్లీ ధరించాలి.

అలాగే మీరు ధరించే రుద్రాక్షను మరెవరికీ ఇవ్వకూడదు.. రుద్రాక్ష మాల ధరించినట్లయితే అందులో కనీసం 27 పూసలు ఉండాలి. అలాగే ఆ సంఖ్య ఎప్పుడూ బేసిగానే ఉండాలి.

రుద్రాక్ష ధరించినవారు మాంసాహారం, మద్యపానం తీసుకోకూడదు.. రుద్రాక్షను దారంలో ధరించడం ఉత్తమమైనప్పటికీ.. దానిని బంగారం లేదా వెండితో కూడా ధరించవచ్చు.

రుద్రాక్ష ధరించినవారు మాంసాహారం, మద్యపానం తీసుకోకూడదు.. రుద్రాక్షను దారంలో ధరించడం ఉత్తమమైనప్పటికీ.. దానిని బంగారం లేదా వెండితో కూడా ధరించవచ్చు.