Konaseema: ఏపీలో ఉన్నామా.. పాకిస్తాన్‌లో ఉన్నామా..? వైసీపీ క్షమాపణ చెప్పాలి: బీజేపీ ఎంపీ జీవీఎల్
అంబేద్కర్ విషయంలో వైసీపీ ప్రభుత్యం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.
BJP MP GVL on YSRCP: కోనసీమ జిల్లాలో జరిగిన ఘర్షణలకు పోలీస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి అంబేద్కర్‌పై చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకి ఆయన పేరు పెట్టొచ్చు కదా అని సూచించారు. అనవసరంగా అంబేద్కర్ పేరుతో వైసీపీ రాద్దాంతం చేసిందంటూ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేద్కర్ విషయంలో వైసీపీ ప్రభుత్యం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ పేరుతో వివాదం చేసిన ఘనత వైసీపీకే దక్కిందని జీవీఎల్ పేర్కాన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్నామా.. పాకిస్తాన్ లో ఉన్నామా..? అంటూ ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. బీజేపీ శ్రేణులు ఈ ఆందోళనలో పాల్గొనలేదని జీవీఎల్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన అమరావతిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు.
విశ్వరూప్, పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి
కోనసీమకు హోం మంత్రి తానేటి వనిత , జోగి రమేష్ చేరుకున్నారు. అమలాపురంలోని విశ్వరూప్ నివాసానికి చేరుకున్న రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత , జోగి రమేష్.. విశ్వరూప్ తోపాటు.. పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..