Konaseema Violence: అమలాపురం ఘటనలో 46 మంది అరెస్ట్.. పరిస్థితి అదుపులోనే ఉంది: ఏపీ డీజీపీ
ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో 72 మంది అరెస్ట్ కు బృందాలు ఏర్పాటు చేసినట్లు ఏపీ డీజీపీ తెలిపారు.

Konaseema District Rename Violence: అమలాపురం ఘటనపై 7 కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్, మంత్రి విశ్వరూప్ రెండు ఇల్లుల దహనం, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి కి నిప్పు, మూడు బస్సుల దగ్దం పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు డిజిపి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి (Rajendranath Reddy) తెలిపారు. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో 72 మంది అరెస్ట్ కు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లందరిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం అమలాపురంలో పరిస్తితి పూర్తి గా అదుపులో ఉందని తెలిపారు. అదనపు బలగాల మోహరించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశమే లేదన్నారు. నిన్నటి ఘటన అనుకోకుండా జరిగిన పరిణామంగానే భావిస్తున్నామని చెప్పారు. వాట్సప్ గ్రూప్ ల లో తప్పుడు ప్రచారం ద్వారా గుమిగూడినట్లు తెలిపారు.
అమలాపురం లో ఇంటర్నెట్ పై తాత్కాలికంగా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉందని.. గ్రూప్స్ గా తిరిగితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ ఎగ్జాం నేపథ్యంలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని డీజీపీ వివరించారు.




మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..