Telangana: ఆ సమస్య పరిష్కరించడం లేదని.. ఏకంగా ఆఫీస్‌కు మంచం, దుప్పటితో వచ్చేశారు..

ఖమ్మం జిల్లాలో ఓ మహిళ ఊహించనివిధంగా ఆందోళనకు దిగింది. మంచం, దుప్పట్లు తెచ్చుకునిమరీ తహశీల్దార్‌ ఆఫీస్‌ ముందు మకాం వేసింది.

Telangana: ఆ సమస్య పరిష్కరించడం లేదని.. ఏకంగా ఆఫీస్‌కు మంచం, దుప్పటితో వచ్చేశారు..
Khammam
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 25, 2022 | 9:35 AM

Khammam Nelakondapally: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ కుటుంబం వినూత్నంగా నిరసనకు దిగింది. తమ భూమిని ఇతరుల పేరున రికార్డుల్లోకి ఎక్కించారంటూ తహశీల్దార్‌ ఆఫీస్‌లో ఆందోళనకు దిగారు. మంచం, దుప్పట్లు అన్నీ తీసుకుని వచ్చి, తహశీల్దార్‌ కార్యాలయంలోనే మకాం పెట్టారు. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామానికి చెందిన అరుణకు ఎకరం మూడు కుంటల భూమి ఉంది. వారసత్వంగా అది వాళ్లకు సంక్రమించింది. అయితే, ఆ భూమిని ఇతరుల పేరున రాసేశారు రెవెన్యూ అధికారులు. దాంతో, ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలేమీ వాళ్లకు అందకుండా పోతున్నాయ్. ఉన్నదే కొద్దిపాటి భూమి, అదీ కూడా తమ పేరున లేకుండా చేయడంతో రైతుబంధులాంటి స్కీమ్‌ తమకు అందకుండా పోతోందని అంటోంది బాధిత కుటుంబం. ఏళ్లతరబడి ఆఫీస్‌ చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు అరుణ పేర్కొంది.

ఎకరం పొలంపైనే ఆధారపడి తమ కుటుంబం జీవిస్తోందని, తమ భూమికి పట్టా పాస్‌ బుక్‌ ఇప్పించాలని కోరుతోంది బాధిత కుటుంబం. లేదంటే, ఇక్కడ్నుంచి కదిలేది లేదంటూ కొడుకుతో కలిసి తహశీల్దార్‌ ఆఫీస్‌ ముందే మకాం పెట్టింది అరుణ. దీంతో పోలీసులు చేరుకొని వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాకైన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?