గర్ల్ ఫ్రెండ్‌ని చంపాడు.. శవాన్ని తోటలో పాతి పెడుతుండగా షాకింగ్ సీన్‌.. చెమటలు పట్టి..

ఒక గొయ్యి తవ్వి ఆ శవాన్ని పాతిపెట్టడానికి రెడీ అయ్యాడు. అప్పుడే అనుకోని సంఘటన జరిగింది.

గర్ల్ ఫ్రెండ్‌ని చంపాడు.. శవాన్ని తోటలో పాతి పెడుతుండగా షాకింగ్ సీన్‌.. చెమటలు పట్టి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 25, 2022 | 9:08 AM

Man strangles girlfriend: వారిద్దరూ ప్రేమించుకొని ఏళ్లపాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఏళ్లుగా సహజీవనం చేస్తున్న తన ప్రియురాలిని ఓ వ్యక్తి అమానుషంగా చంపేశాడు. ఇంట్లో ఉన్న ఆమె శవాన్ని ఒక సంచిలో వేసుకొని సమీపంలోని తోటలోకి తీసుకొచ్చాడు. అక్కడ ఒక గొయ్యి తవ్వి ఆ శవాన్ని పాతిపెట్టడానికి రెడీ అయ్యాడు. అప్పుడే అనుకోని సంఘటన జరిగింది. సరిగ్గా ఆమెను పాతిపెడుతున్న సమయంలోనే హంతకుడికి హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ ఘటన అమెరికాలోని సౌత్ కరోలినాలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ట్రెండన్ ప్రాంతంలో నివసింటే.. జోసెఫ్ ఆంధోని మెక్‌కిన్నన్ (60) తన ప్రియురాలు ప్యాట్రిసియా రూత్ డెంట్ (65) కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడు. ఆమెతో ఏదో గొడవ పడిన జోసెఫ్.. పెట్రిసియాను గొంతు నులిపి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని తోటలో పాతి పెట్టాలని నిర్ణయించుకొని తీసుకెళ్లాడు. తోటలో ఒక గొయ్యి తవ్వాడు. ఆ తర్వాత ఆమెను పాతిపెడుతుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడని ట్రెండన్ పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత.. తోటలో ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన అధికారులకు గోతిలో ఉన్న ఇంకో శవం కనిపించడంతో షాకయ్యారు. అయితే. పోస్టుమార్టం రిపోర్టులో మహిళ హత్యకు గురి కాగా.. అతను గుండెపోటుతో మరణించినట్లు తేలిందని కరోలినా పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి