AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాశీయాత్రకు వెళ్తుండగా ప్రమాదం.. బీహార్‌లో తెలంగాణ వాసి మృతి.. మరో ఐదుగురికి..

బీహార్‌లోని ఔరంగబాద్‌కు చేరుకున్న తర్వాత ఓ హోటల్ వద్ద బస్సును ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది.

Telangana: కాశీయాత్రకు వెళ్తుండగా ప్రమాదం.. బీహార్‌లో తెలంగాణ వాసి మృతి.. మరో ఐదుగురికి..
Shaik Madar Saheb
|

Updated on: May 25, 2022 | 8:38 AM

Share

Road Accident: తెలంగాణ వాసుల కాశీ పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 38 మంది యాత్రికులతో మంగళవారం ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ నుంచి కాశీయాత్రకు బయలుదేరింది. ఈ క్రమంలో బీహార్‌లోని ఔరంగబాద్‌కు చేరుకున్న తర్వాత ఓ హోటల్ వద్ద బస్సును ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది.

ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లాలోని వెల్మడ్‌కు చెందిన వృద్ధురాలు సరలమ్మ (70) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఐదుగురిని వెంటనే ఔరంగాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పర్యాటకులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. కాగా ఈ బస్సులో నిజామాబాద్‌ జిల్లాలోని వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్ గ్రామాలకు చెందిన వారితోపాటు నిర్మల్ జిల్లా బాసరకు చెందిన యాత్రికులు ఉన్నారు. దీంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నవరాత్రుల్లో జుట్టు, గడ్డం, గోళ్లు ఎందుకు కత్తిరించకూడదంటారు?
నవరాత్రుల్లో జుట్టు, గడ్డం, గోళ్లు ఎందుకు కత్తిరించకూడదంటారు?
హోమ్ లోన్ టెన్షన్ అక్కర్లేదు.. ఈ ట్రిక్స్ తెలిస్తే లక్షల రూపాయలు
హోమ్ లోన్ టెన్షన్ అక్కర్లేదు.. ఈ ట్రిక్స్ తెలిస్తే లక్షల రూపాయలు
రాజ్యాంగ సంస్థలపై దాడులపై 42 మంది మాజీ జడ్జిల వార్నింగ్!
రాజ్యాంగ సంస్థలపై దాడులపై 42 మంది మాజీ జడ్జిల వార్నింగ్!
వందల ఏళ్లుగా గ్రామంలో పెళ్లిళ్లు జరగవు.. రేణుకా మాత కథే కారణమా?
వందల ఏళ్లుగా గ్రామంలో పెళ్లిళ్లు జరగవు.. రేణుకా మాత కథే కారణమా?
మనం ఇద్దరం గత జన్మ ప్రేమికులమని ఆయకు వేధింపులు..
మనం ఇద్దరం గత జన్మ ప్రేమికులమని ఆయకు వేధింపులు..
మైనర్‌పై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ లైంగిక దాడి!
మైనర్‌పై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ లైంగిక దాడి!
బద్ధకంతో పనులు వాయిదా వేస్తే ఇలాగే జరుగుతుంది.. కాకి - చిలుక కథ
బద్ధకంతో పనులు వాయిదా వేస్తే ఇలాగే జరుగుతుంది.. కాకి - చిలుక కథ
ఆలోచిస్తేనే భయమేస్తోంది.. ప్రత్యర్థులకు ఏబీడీ మాస్ వార్నింగ్..!
ఆలోచిస్తేనే భయమేస్తోంది.. ప్రత్యర్థులకు ఏబీడీ మాస్ వార్నింగ్..!
మనుషుల వల్ల ఈ అందమైన పక్షి గొంతే మారిపోయింది..హిమాలయాల్లో షాకింగ్
మనుషుల వల్ల ఈ అందమైన పక్షి గొంతే మారిపోయింది..హిమాలయాల్లో షాకింగ్
అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది
అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది