World Book Of Records: వావ్.. 'సూపర్ కిడ్' పసి వయసులో బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్చిన చిన్నారులు..!

World Book Of Records: వావ్.. ‘సూపర్ కిడ్’ పసి వయసులో బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్చిన చిన్నారులు..!

Anil kumar poka

|

Updated on: May 25, 2022 | 9:21 AM

పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో.. వాళ్ల వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువే.. అయితేనేం.. అపూర్వ జ్ఞాపకశక్తి వారి సొంతం. అనేక అవార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. హైదరాబాద్‌కు గర్వకారణంగా మారిన ఇద్దరు తెలివైన కిడ్స్ వరల్డ్ బుక్ రికార్డ్స్ బ్రేక్ చేసి చరిత్ర సృష్టిస్తున్నారు.


పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో.. వాళ్ల వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువే.. అయితేనేం.. అపూర్వ జ్ఞాపకశక్తి వారి సొంతం. అనేక అవార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. హైదరాబాద్‌కు గర్వకారణంగా మారిన ఇద్దరు తెలివైన కిడ్స్ వరల్డ్ బుక్ రికార్డ్స్ బ్రేక్ చేసి చరిత్ర సృష్టిస్తున్నారు.మీరు చూస్తున్న ఈ ఇద్దరు పిల్లలు తెలివైన అక్క చెల్లెళ్లు. హైదరాబాద్‌కు చెందిన ఈ అక్క చెల్లలు ఖేయా గౌరిశెట్టి, ఇష్యా గౌరిశెట్టి అనేక అవార్డులను సంపాదించారు. తొమ్మిదేళ్ల ఖేయాకు ‘సూపర్ కిడ్’, ‘జికె క్వీన్’ వంటి మోనికర్లు ఉన్నాయి. ఖేయా వివిధ దేశాలకు చెందిన 100 జెండాలను, మ్యాప్ నుండి 195 దేశాలను, భారత మ్యాప్‌లోని 30 ప్రదేశాలను, 41 స్మారక చిహ్నాలు, 35 క్రీడా వస్తువులు, 54 గుర్తించగలదు. అలాగే, 7 సంవత్సరాల ఇష్యా, 2 నిమిషాల్లో ప్రపంచ పటంలో 195 దేశాలను గుర్తించినందుకు ‘జియోగ్రఫీ విజార్డ్’, ‘గ్రాండ్ మాస్టర్’ అనే టైటిల్‌ను దక్కించుకుంది. ఖేయా ఇప్పటికే అనేక సంస్థలు, బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. ఒక్క నిమిషం 30 సెకన్లలోపు 100 దేశాలను వారి జెండాల నుండి గుర్తించినందుకు క్రియేటివ్ రికార్డ్స్ ఆమెను ప్రశంసించింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఖేయా, ఇష్యా వారి తల్లిదండ్రులు వరుణ్, లలిత గౌరిశెట్టి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సృజనాత్మక అభ్యాసం చేయించామని చెప్పారు. ఇంట్లో కఠినమైన శిక్షణతో తమ పిల్లలు ఇంటికి ప్రతిష్టాత్మక ప్రశంసలు తెస్తున్నారని అనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Published on: May 25, 2022 09:21 AM