AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh: క్రికెట్ బెట్టింగ్‌లో కోటి పోగొట్టుకున్న పోస్ట్‌మాస్టర్.. ఆ డబ్బు ఎక్కడి నుంచి లేపేశాడో తెలిస్తే మైండ్ బ్లాంకే..

IPL Betting: దేశంలో క్రికెట్ ప్రియులు ఎక్కువ. IPL సీజన్ రాగానే ఫ్యాన్స్ కే కాదు.. బెట్టింగ్ రాయుళ్లకూ పండగే పండగ. తక్కువ సమయంలో సెటిల్ అయిపోవాలని చాలా మంది ఇష్టం వచ్చినట్లు పందాలు కాస్తుంటారు.

Madhya Pradesh: క్రికెట్ బెట్టింగ్‌లో కోటి పోగొట్టుకున్న పోస్ట్‌మాస్టర్.. ఆ డబ్బు ఎక్కడి నుంచి లేపేశాడో తెలిస్తే మైండ్ బ్లాంకే..
Ipl Betting
Ayyappa Mamidi
|

Updated on: May 25, 2022 | 11:15 AM

Share

IPL Betting: దేశంలో క్రికెట్ ప్రియులు ఎక్కువ. IPL సీజన్ రాగానే ఫ్యాన్స్ కే కాదు.. బెట్టింగ్ రాయుళ్లకూ పండగే పండగ. తక్కువ సమయంలో సెటిల్ అయిపోవాలని చాలా మంది ఇష్టం వచ్చినట్లు పందాలు కాస్తుంటారు. సొంత డబ్బుతో ఇలా చేస్తే ఓకే.. ఎందుకంటే పోగొట్టుకున్నా ఇతరులకు పెద్దగా నష్టం ఉండదు. మరి కొందరైతే అప్పులు చేసి మరీ ఈ వ్యసనాన్ని కొనసాగిస్తుంటారు. ఇలా చేయటం వల్ల బెట్టింగ్ రాయుళ్ల కుటుంబాలు ఇబ్బందులు పడటం మనం చూసే ఉంటాం లేదా కనీసం వినే ఉంటాం. కానీ.. మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక ఘటనలో ఒక పోస్ట్‌మాస్టర్ చేసిన పనితో అందరూ షాక్ కి గురవుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ చేస్తూ మధ్యప్రదేశ్‌లోని ఓ పోస్ట్‌మాస్టర్ రెండు డజన్ల కుటుంబాలకు చెందిన రూ. కోటి పొదుపు సొమ్ము పోగొట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు కుటుంబాల పొదుపు సొమ్మును సాగర్‌ జిల్లాలోని సబ్‌ పోస్టాఫీసులో జమ చేయాల్సి ఉంది. బీనా సబ్ పోస్టాఫీసు పోస్ట్ మాస్టర్ విశాల్ అహిర్వార్‌ను మే 20న బీనా ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తాను చేసిన నేరాన్ని పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. వినియోగదారులకు చెందిన సొమ్మును వినియోగించుకునేందుకు సదరు పోస్ట్‌మాస్టర్ నకిలీ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలను సృష్టించేందుకు నిజమైన పాస్‌బుక్‌లను జారీ చేశాడు. గత రెండేళ్ల నుంచి ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో ఈ మొత్తం డబ్బును పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

అరెస్ట్ అయిన సబ్ పోస్ట్‌మాస్టర్ విశాల్ అహిర్వార్‌పై ప్రస్తుతం u/s 420 IPC కింద చీటింగ్, సెక్షన్- 408 IPC కింద నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కింద అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. తదుపరి విచారణల్లో వెల్లడయ్యే వివరాల ఆధారంగా కేసులో మరిన్ని సెక్షన్‌లను చేర్చుతామని బీనా రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ ధుర్వే వెల్లడించారు. ప్రభుత్వరంగంలోని పోస్టల్ సర్వీసులో చాలా మంది ప్రజలు చిన్న మెుత్తాల్లో తమ సొమ్మును దాచుకుంటుంటారు.  IPL బెట్టింగ్‌లో పోస్ట్‌మాస్టర్ కోటి రూపాయలు పోగొట్టుకోవటం.. అందుకోసం నిందితుడు 24 కుటుంబాల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఉపయోగించటం ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..