AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV’s On Fire: ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రమాదాలకు అసలు కారణం అదే.. DRDO నివేదికలో షాకింగ్ విషయాలు..

EV's On Fire: డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగటం, అకస్మాత్తుగా పేలిపోవటంపై తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఇందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

EV's On Fire: ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రమాదాలకు అసలు కారణం అదే.. DRDO నివేదికలో షాకింగ్ విషయాలు..
Ev On Fire
Ayyappa Mamidi
|

Updated on: May 25, 2022 | 11:52 AM

Share

EV’s On Fire, electric scooters, EV batteries, fire in electric scootersఇటీవలి కాలంలో గత కొన్ని నెలలుగా ఈ-స్కూటర్లలో మంటలకు బ్యాటరీ ప్యాక్‌లు.., మాడ్యూల్స్ డిజైన్‌లతో సహా బ్యాటరీల్లోని లోపాలే కారణమని DRDO వెల్లడించింది. కేంద్ర రోడ్డురవాణా అండ్ రహదారుల మంత్రిత్వశాఖ దేశంలో జరిగిన అనేక ఈ- స్కూటర్ అగ్నిప్రమాదాలకు గల కారణాలపై పరిశోధన జరపాలని DRDOని కోరింది. దీంతో ఫైర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అయిన ఫైర్, ఎక్స్‌ప్లోజివ్, ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ(CFEES)ని నియమించింది. CFEES గత వారం ఈ-స్కూటర్ అగ్ని ప్రమాదాలపై తన నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించింది. దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారుల కోసం మరింత కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని సూచించింది.

ప్రమాదాల వెనుక బ్యాటరీ సెల్‌ల నాణ్యత తక్కువగా ఉండటం కారణంగా తెలిపింది. దీనికి తోడు వివిధ ఉష్ణోగ్రతల కింద బ్యాటరీ ప్యాక్‌లను తగినంతగా పరీక్షించకపోవడం వల్ల ఈ ఘటనలు జరిగినట్లు ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తి బిజినెస్ స్టాండర్డ్‌కు చెప్పారు. ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్దేశపూర్వకంగా తక్కువ-గ్రేడ్ మెటీరియల్‌ని ఉపయోగించడం వల్ల లోపాలు ఏర్పడవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు.

ఒక్కో సెల్ ప్రవర్తన వివిధ ఉష్ణోగ్రతల్లో, ఛార్జ్ స్థితుల్లో, వివిధ డిమాండ్ల ప్రకారం ఎలా మారుతుందో ఆల్టిగ్రీన్ ప్రొపల్షన్ ల్యాబ్ వ్యవస్థాపకుడు, CEO అమితాబ్ శరణ్ వివరించారు. అందువల్ల లిథియం-అయాన్ బ్యాటరీలు వాటి భద్రతను నిర్ధారించడానికి భారతీయ ఉష్ణోగ్రత, డిమాండ్ పరిస్థితుల్లో సరైన R&D ప్రక్రియ ద్వారా పరీక్షించబడటం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.