Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CIBIL Score: సిబిల్ స్కోర్ అంత ముఖ్యమైనదా..? అది ఎంత ఉంటే లోన్స్ వస్తాయో తెలుసా..

CIBIL Score: ప్రతి వ్యక్తికి ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు లేదా ఏదైనా లోన్ తప్పనిసరిగా మారాయి. ఈ తరుణంలో అసలు క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. అందువల్ల అందరూ సిబిల్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

CIBIL Score: సిబిల్ స్కోర్ అంత ముఖ్యమైనదా..? అది ఎంత ఉంటే లోన్స్ వస్తాయో తెలుసా..
Cibil Score
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 25, 2022 | 7:49 AM

CIBIL Score: ప్రతి వ్యక్తికి ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు లేదా ఏదైనా లోన్ తప్పనిసరిగా మారాయి. ఈ తరుణంలో అసలు క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. అందువల్ల అందరూ సిబిల్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అసలు ఒక వ్యక్తికి ఎంత క్రెడిట్ స్కోర్ అవసరం.. ఎంత ఉంటే లోన్స్ సులువుగా లభిస్తాయి. తక్కువ వడ్డీకే లోన్స్ కావాలంటే క్రెడిట్ హిస్టరీ, స్కోర్ ఎంత ఉండాలో తెలుసుకుందాం..

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ఈ క్రెడిట్ స్కోర్ అందిస్తుంది. ఈ స్కోర్ ను సిబిల్ అని అంటారు. ఈ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది. కనీసం 750 స్కోర్ ఉంటే మంచిది. ఇంత స్కోర్ ఉండే వ్యక్తులు సమయానికి వారు చెల్లించాల్సిన లోన్స్, పేమెంట్స్ చేస్తున్నారని అర్థం. ఇలా సమయానికి చెల్లింపులు చేయటం వల్ల బ్యాంకులకు కూడా రిస్క్ తక్కువగా ఉంటుంది. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ కలిగిన వ్యక్తులకు బ్యాంకులు సులువుగా లోన్స్, క్రెడిట్ కార్డులను మంజూలు చేస్తుంటాయి. ఇదే సమయంలో 700-749 వరకు క్రెడిట్ స్కో్ర్ ఉన్నట్లయితే.. క్రెడిట్ హిస్టరీ పర్లేదని అర్థం. కానీ ఈ క్యాటగిరీలోని వారికి లోన్స్ మంజూరైనప్పటికీ.. తక్కువ వడ్డీ రేట్లకు వాటిని పొందాలంటే క్రెడిట్ స్కోర్ ను తప్పక మెరుగుపరుచుకోవాలి.

600 నుంచి 699 మధ్య క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే సదరు వ్యక్తలు సకాలంలో లోన్స్ చెల్లింపులు చేయటానికి ఇబ్బందిపడుతున్నారని అర్థం. ఇలాంటి వారితో రిస్క్ ఎక్కువ అని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు భావిస్తాయి. కానీ.. క్రెడిట్ స్కోర్ ఇంతకంటే పడిపోకుండా చూసుకోవాలి. లేకుంటే తర్వాతి కాలంలో లోన్స్ రిజెక్ట్ అవ్వటం లేదా ఎక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందాల్సి ఉంటుంది. ఇక ఆకరగా 350 నుంచి 599 మధ్య క్రెడిట్ స్కోర్ కలిగిఉంటే సమయానికి లోన్స్ చెల్లింపులు చేయటం లేదని అర్థం. ఈ కేటగిరీ వినియోగదారులతో బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఇలాంటి కస్టమర్లకు లోన్స్ మంజూరు చేయవు. దీనికి తోడు ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వ్యక్తులకు స్కోర్ NA/NH అని చూపిస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్ ను కొనసాగించాలంటే మీరు పొందిన క్రెడిట్ లిమిట్ లో 30 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటే మంచిది. సరసమైన రేటుకే లోన్స్ పొందాలంటే.. కస్టమర్లు తమ క్రెడిట్ స్కోర్ పై తప్పకుండా దృష్టి సారించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి