Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. కంపెనీల ఫలితాలతో జోష్ లో ఇన్వెస్టర్లు..
Stock Market: నిన్నటి నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాయ మార్కెట్లు కొంత ఆశాజనకంగా లేనప్పటికీ.. అనేక కంపెనీల ఫలితాలు మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ కు కారణంగా నిలుస్తున్నాయి.
Stock Market: నిన్నటి నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాయ మార్కెట్లు కొంత ఆశాజనకంగా లేనప్పటికీ.. అనేక కంపెనీల ఫలితాలు మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ కు కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరంభంలోనే భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయానికి బెంచ్ మార్క్ ఇండెక్స సూచీ సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 80 పాయింట్లు లాభపడింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 265 పాయింట్ల పాజిటివ్ లో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 105 పాయింట్ల మేర పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లు శుభారంభంతో ప్రారంభమైనట్లు చెప్పుకోవాలి. మరో పక్క ఇంధన ధరలు అధిక డిమాండ్, సప్లై సమస్యల కారణంగా పెరుగుతున్నాయి.
నిఫ్టీ సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.62%, ఎన్టీపీసీ 1.50%, ఓఎన్జీసీ 1.36%, హెచ్డీఎఫ్సీ 1.33%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.27%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.26%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.24%, సిప్లా 1.20%, యాక్సిస్ బ్యాంక్ 1.17%, హీరో మోటొకార్ప్ 1.17% మేర ఆరంభంలో లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో ఏషియన్ పెయింట్స్ 2.82%, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 2.03%, టెక్ మహీంద్రా 1.45%, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1.37%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 0.92%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 0.71%, విప్రో లిమిటెడ్ 0.70%, టాటా మోటార్స్ 0.58%, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 0.45%, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 0.41% మేర ఆరంభంలో నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..