AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Medals: మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. పోలీస్ మెడల్స్ నుంచి ఆయన చిత్రం తొలిగింపు..

ప్రభుత్వ ఆదేశానుసారం షేక్‌ అబ్దుల్లాకు బదులుగా అశోక స్తంభం గుర్తును పతకంపై ముంద్రించనున్నారు. మెడల్‌పై అశోక స్తంభం గుర్తు పెట్టాలని హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోం సెక్రటరీ ఆర్కే గోయల్..

Police Medals: మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. పోలీస్ మెడల్స్ నుంచి ఆయన చిత్రం తొలిగింపు..
Sheikh Abdullah From The Po
Sanjay Kasula
|

Updated on: May 25, 2022 | 11:25 AM

Share

మరో మార్పుకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై జమ్ము కశ్మీర్ పోలీస్ మెడల్‌లో(Police Medals) షేక్‌ అబ్దుల్లా చిత్రాన్ని తొలగించింది. ప్రభుత్వ ఆదేశానుసారం షేక్‌ అబ్దుల్లాకు బదులుగా అశోక స్తంభం గుర్తును పతకంపై ముంద్రించనున్నారు. మెడల్‌పై అశోక స్తంభం గుర్తు పెట్టాలని హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోం సెక్రటరీ ఆర్కే గోయల్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వులో జమ్ము కశ్మీర్ పోలీస్ మెడల్ స్కీమ్‌లోని పారా-4 సవరించబడింది. కొత్త నిబంధన ప్రకారం.. షేక్ అబ్దుల్లా ఇప్పుడు భారతదేశ చిత్రాన్ని చేర్చనున్నారు. జాతీయ చిహ్నం అశోక స్థూపాన్ని ఇందులో పొందుపర్చాలని నిర్ణయించారు. ఇప్పుడు జమ్ము కశ్మీర్ చిహ్నం పతకంపై ఒకవైపు ఉండగా, మరోవైపు అశోక స్తంభం ఉంటుంది. ఇంతకుముందు ప్రభుత్వం పోలీస్ మెడల్ పేరును కూడా మార్చింది. మొదటి పతకం పేరు ‘షేర్-ఎ-కశ్మీర్ పోలీస్ మెడల్’ అని కాకుండా దానిని ‘జమ్ము కశ్మీర్ పోలీస్ మెడల్’గా మార్చారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వ్యతిరేకించగా.. బీజేపీ మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధి ఇమ్రాన్ నబీ ఇది చరిత్రను చెరిపేసే నిర్ణయమని అన్నారు. కాబట్టి ఇలాంటి బానిసత్వ చిహ్నాలను రద్దు చేయాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా అన్నారు.

తన తండ్రికి గుర్తుగా..

ఒక్కప్పటి జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా జ్ఞాపకార్థం పోలీస్ మెడల్‌పై ఆయన చిత్రాన్ని ముంద్రించారు.

జమ్ము కశ్మీర్‌లో ప్రధానిగా సీఎంగా పనిచేశారు

నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీని స్థాపించిన షేక్ అబ్దుల్లా జమ్ము కశ్మీర్‌కు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆయన 1948 నుంచి 1953 వరకు ప్రధానమంత్రిగా.. 1975 నుంచి 1982 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అతను జిన్నా ప్రతిపాధించిన రెండు-దేశాల సిద్ధాంతాన్ని తిరస్కరించాడు. కశ్మీర్‌ను భారతదేశంలో విలీనానికి మొగ్గు చూపాడు. రాష్ట్రంలోని అనేక భవనాలు, వీధులకు ఇప్పటికీ షేక్ అబ్దుల్లా పేరు ఉంది. 2019 సంవత్సరంలో జమ్ము కశ్మీర్ రాష్ట్ర పరిపాలన అధికారిక ప్రమాణాల జాబితా నుంచి షేక్ అబ్దుల్లా జన్మదినాన్ని తొలగించింది.