DMHO Kurnool Recruitment 2022: పదో తరగతి/డిప్లొమా అర్హతతో..కర్నూలు డీఎమ్‌హెచ్‌ఓ కార్యాలయంలో ఉద్యోగాలు..నేరుగా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్‌లో (DMHO Kurnool District) భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్, ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌ పోస్టుల (Lab Technician Posts) భర్తీకి..

DMHO Kurnool Recruitment 2022: పదో తరగతి/డిప్లొమా అర్హతతో..కర్నూలు డీఎమ్‌హెచ్‌ఓ కార్యాలయంలో ఉద్యోగాలు..నేరుగా..
Dmho Kurnool
Follow us
Srilakshmi C

|

Updated on: May 25, 2022 | 9:43 AM

DMHO Kurnool Lab Technician Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్‌లో (DMHO Kurnool District) భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్, ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌ పోస్టుల (Lab Technician Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 7

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్, ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • ల్యాబ్‌ టెక్నీషియన్ పోస్టులు: 5
  • ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ (మహిళలకు మాత్రమే) పోస్టులు: 1
  • శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.12,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి పదో తరగతి, డీఎంఎల్‌టీ, బీఎస్సీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: District Medical and Health Office (DMHO), Kurnool, AP.

దరఖాస్తులకు చివరితేదీ: మే 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.