NEET UG 2022: నీట్‌ యూజీ 2022 కరెక్షన్‌ విండో ఓపెన్‌.. తప్పులను సరిదిద్దుకునే అవకాశం!

నీట్‌ యూజీ (NEET UG 2022) ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కరెక్షన్ విండో ఓపెన్‌ అయినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం (మే 24) ప్రకటించింది..

NEET UG 2022: నీట్‌ యూజీ 2022 కరెక్షన్‌ విండో ఓపెన్‌.. తప్పులను సరిదిద్దుకునే అవకాశం!
Neet Ug 2022
Follow us
Srilakshmi C

|

Updated on: May 25, 2022 | 9:47 AM

NEET UG 2022 correction window opened: నీట్‌ యూజీ (NEET UG 2022) ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కరెక్షన్ విండో ఓపెన్‌ అయినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం (మే 24) ప్రకటించింది. మే 24 నుంచి మే 27 వరకు కరెక్షన్ విండో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసింది. నీట్‌ యూజీ 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, దరఖాస్తు సమయంలో ఏవైనా పొరపాట్లు చేసిఉంటే అధికారిక వెబ్‌సైట్‌లో సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మే 27 తర్వత వివరాలను సవరించుకోవడానికి అవకాశం ఉండదు. ఐతే వివరాలను సరిదిద్దుకోవడానికి ముందు అభ్యర్థులు ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. కాగా నీట్‌ యూజీ 2022 ప్రవేశ పరీక్ష జులై 17 (ఆదివారం)న దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ పద్దతిలో (పెన్‌-పేపర్‌) పలు పరీక్ష కేంద్రాల్లో 13 భాషల్లో జరగనుంది. ఈ పరీక్ష 200 ప్రశ్నలకు 200 నిముషాలపాటు కొనసాగుతుంది.

NEET UG 2022 కరెక్షన్‌ ఎలా చేయాలంటే..

ఇవి కూడా చదవండి
  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ neet.nta.nic.inను ఓపెన్ చెయ్యాలి.
  • హోమ్ పేజ్‌లో కనిపించే NEET UG 2022 లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • లాగిన్ ఆధారాలను నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి.
  • వెంటనే అభ్యర్థికి సంబంధించిన అప్లికేషన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • అప్లికేషన్‌ను తరవుగా చెక్‌ చేసి, సవరణలు చేసుకోవాలి.
  • ఆ తర్వాత సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తును సేవ్‌ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం