Work From Office: ఇకపై వారానికి నాలుగు రోజులే వర్క్.. వర్కవుట్ అయితే అదే బాటలో మరిన్ని దేశాలు

కరోనా(Corona) కారణంగా పలు సంస్థలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) వెసుబాటు కల్పించాయి. అయితే కొద్ది కాలంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో వారిని....

Work From Office: ఇకపై వారానికి నాలుగు రోజులే వర్క్.. వర్కవుట్ అయితే అదే బాటలో మరిన్ని దేశాలు
Work Frome Office
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 29, 2022 | 4:02 PM

కరోనా(Corona) కారణంగా పలు సంస్థలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) వెసుబాటు కల్పించాయి. అయితే కొద్ది కాలంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో వారిని తిరిగి ఆఫీసులకు రప్పించడానికి యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అవసరమైతే రాజీనామా(Resignation) అయినా చేస్తాం. కానీ ఆఫీస్ లకు రాలేమన్న ఉద్యోగుల మాటలతో ఏమీ చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులు మన దగ్గరే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లోనూ ఉన్నాయి. ప్రపంచ దేశాల్ని కలవరానికి గురి చేస్తున్న దిగ్రేట్‌ రిజిగ్నేషన్‌, అట్రిషన్‌ రేట్‌ నుంచి సురక్షితంగా ఉండేందుకు పలు సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందు0లో భాగంగా కంపెనీలు వర్కింగ్ డేస్‌ను తగ్గించేస్తున్నాయి. వారానికి 5రోజులు కాకుండా 4రోజుల పాటు వర్క్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. యూకేకు చెందిన 60 కు పైగా కంపెనీలు జూన్‌ నుంచి వారానికి 4 రోజుల పాటు వర్క్‌ చేసే వెసలుబాటు కల్పిస్తున్నాయి.

ఉద్యోగుల ప్రొడక్టివిటీ, అట్రిషన్‌ రేట్‌, రిజిగ్నేషన్‌ తో పాటు ఇతర అంశాల్లో సత్ఫలితాలు రాబడితే శాశ్వతంగా వర్కింగ్‌ డేస్‌ను కుదించనున్నారు. ఈ ప్లాన్‌ వర్కౌట్‌ అయితే స్పెయిన్‌, ఐస్‌ల్యాండ్‌,యూఎస్‌, కెనడా, ఆస్ట్రేలియా,న్యూజిల్యాండ్‌ దేశాలకు చెందిన సంస్థలు సైతం యూకే బాటలో పయనించనున్నాయి. పనిదినాల్ని కుదించడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారానికి 4 రోజులు పనిచేయడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హయ్యర్‌ స్టడీస్‌తో పాటు నైపుణ్యాలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి