Food Poisoning: గిరిజన జాతరలో ఫుడ్ పాయిజన్.. ‘పానీపూరి’ తిన్న 97 మంది చిన్నారులకు అస్వస్థత
మధ్యప్రదేశ్‌లోని మండలా జిల్లాలో జరిగిన ఒక జాతరలో 'పానీ పూరీ' తిని తొంభై ఏడు మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడినట్లు ఆరోగ్య అధికారి ఆదివారం తెలిపారు.
Food Poisoning: స్ట్రీట్ ఫుడ్ లో పానీపూరిది ప్రత్యేక స్థానం. పిల్లలు, పెద్దల ఇలా ఎవరైనా వయసుతో పని లేకుండా ఇష్టంగా తింటారు. అయితే గత కొంతకాలంగా పానీపూరి విందు, వినోదాల్లో స్నాక్స్ ఐటెమ్స్ లో భాగంగా చోటు దక్కించుకుంది. తాజాగా ఒక జాతరలో పానీ పూరి తిన్న పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం బాధిత చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని మండలా జిల్లాలో జరిగిన ఒక జాతరలో ‘పానీ పూరి’ తిని తొంభై ఏడు మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడినట్లు ఆరోగ్య అధికారి ఆదివారం తెలిపారు. ఆ రాష్ట్రంలోని మండ్లా జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలోని గిరిజనులు అధికంగా ఉండే సింగర్పూర్‌లో ప్రాంతంలో శనివారం రాత్రి జాతర జరిగింది. ఇక్కడ జరిగిన జాతరలో ఒకే షాపులో పానీ పూరీ తిన్న 97 మంది చిన్నారులు అనంతరం అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో చిన్నారులు వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నారని జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కెఆర్ శాక్య పిటిఐకి తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణంగా తొంభై ఏడు మంది చిన్నారులు జిల్లా ఆసుపత్రిలో చేరారినట్లు చెప్పారు. చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు.. వారంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు.
ఇప్పటికే ‘పానీ పూరీ’ ని అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. స్నాక్ శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను శనివారం రాత్రి మంత్రులు పరామర్శించారు. చిన్నారులకు మెరుగైన చికిత్సని ఇవ్వమని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..