Omicron BA.4: మహారాష్ట్రలో కొత్త వేరియంట్ కలకలం.. ఏడుగురికి పాజిటివ్.. ఆందోళన వద్దంటున్న అధికారులు

ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ మొదటిసారి దక్షిణాఫ్రికాలో ఏప్రిల్‌లో నిర్ధారణ కాగా.. అనంతరం అనేక ప్రపంచం దేశాల్లో ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ వ్యాప్తి చెందాయి. మన దేశంలో గత వారం రోజుల క్రితం తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

Omicron BA.4: మహారాష్ట్రలో కొత్త వేరియంట్ కలకలం.. ఏడుగురికి పాజిటివ్.. ఆందోళన వద్దంటున్న అధికారులు
Omicron Sub Variants
Follow us

|

Updated on: May 29, 2022 | 10:45 AM

Omicron Sub-Variants: ఓ వైపు కరోనా వైరస్ క్రమంగా అదుపులోకి వస్తుండగా.. వివిధ రాష్ట్రాల్లో సరికొత్త వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మొదటిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ సరికొత్త రూపం BA4 (Omicron BA.4) లతో పాటు  BA5 కేసులు కలకలం రేకెత్తిస్తున్నాయి. తాజాగా నాలుగు బీ.ఏ.4, మూడు బీ.ఏ.5 సబ్-వేరియంట్‌ పాజిటివ్ కేసులు గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.

అయితే ఈ వేరియంట్ విషయంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని.. పాజిటివ్ గా నిర్ధారణ అయినవారిలో తేలికపాటి లక్షణాలు ఉన్నాయని సీనియర్ ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ మొదటిసారి దక్షిణాఫ్రికాలో  ఏప్రిల్‌లో నిర్ధారణ కాగా.. అనంతరం అనేక ప్రపంచం దేశాల్లో ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ వ్యాప్తి చెందాయి. మన దేశంలో గత వారం రోజుల క్రితం తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

“మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది. దీనిని ఫరీదాబాద్‌లోని ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ ధృవీకరించింది. పూణేకు చెందిన ఏడుగురు రోగుల్లో ఒమిక్రాన్  సబ్ వేరియంట్ వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారి పిటిఐకి తెలిపారు. ఈ “నలుగురు రోగుల్లో BA4 వేరియంట్, BA5 గా నిర్ధారణ అయింది. బాధితుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరిలో నలుగురు పేషెంట్లు 50 ఏళ్లు పైబడిన వారు కాగా ఇద్దరు 20-40 ఏళ్ల మధ్య ఉన్నవారు కా.. ఒక బాధిత చిన్నారికి తొమ్మిదేళ్లు అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

న్యూ వేరియంట్ సోకిన వారిలో “ఆరుగురు కరోనా వైరస్ వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్నారు. వారిలో ఒకరు బూస్టర్ షాట్ కూడా తీసుకున్నారు. అయితే చిన్నారి మాత్రం వ్యాక్సిన్ తీసుకోలేదు. వీరందరికీ కోవిడ్ -19  తేలికపాటి లక్షణాలు కలిగి ఉన్నాయి. వీరిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్సనందిస్తున్నారని అధికారి తెలిపారు. మే 4 నుంచి  18 మధ్య వీరి శాంపిల్స్ తీసుకున్నారు. బాధితుల్లో ఇద్దరు దక్షిణాఫ్రికా, బెల్జియంలకు వెళ్లగా, ముగ్గురు కేరళ, కర్ణాటకలకు ప్రయాణించారు. మిగిలిన ఇద్దరు రోగులు ఇటీవలి ఎక్కడికి ప్రయాణించలేదని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..