Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. టూరిస్ట్‌ బస్సు-ట్రక్కు ఢీః.. ఏడుగురు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు

Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్ట్‌ బస్సు-ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. యూపీ (UP)లోని..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. టూరిస్ట్‌ బస్సు-ట్రక్కు ఢీః.. ఏడుగురు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు
Follow us
Subhash Goud

|

Updated on: May 29, 2022 | 10:41 AM

Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్ట్‌ బస్సు-ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. యూపీ (UP)లోని లఖింపూర్‌ బహ్రైచ్‌ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఓ మహిళ సహా ఏడుగురు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయాలైనవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా కర్ణాటక నుంచి అయోధ్యకు దర్శనం కోసం వెళ్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కేకలు మిన్నంటాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని తరలించే పనిలో స్థానికులు నిమగ్నమయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘోర ప్రమాదంపై ఈ ఘటనపై సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. బహ్రైచ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని అన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి