Goods Train: ఆ రైలు ఏడాది కాలం లేటు.. గమ్యస్థానానికి చేరేసరికి అందులోని గూడ్స్ ఏమయ్యాయో తెల్సా..?

తాజాగా ఓ రైలు.. లేటు అన్న పదానికి సరికొత్త అర్ధం ఇచ్చింది.. ఒక గంట.. లేక ఒక రోజో ఆ ట్రైన్ లేటుగా రాలేదు.. ఏకంగా ఏడాది కాలం లేటుగా వచ్చి.. ఆ రైలు చేరాల్సిన తన గమ్య స్థానానికి చేరుకుంది. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం అని తెలుస్తోంది.

Goods Train: ఆ రైలు ఏడాది కాలం లేటు.. గమ్యస్థానానికి చేరేసరికి అందులోని గూడ్స్ ఏమయ్యాయో తెల్సా..?
Goods Train
Follow us

|

Updated on: May 29, 2022 | 12:18 PM

Goods Train: రైలు ప్రయాణం అందమైన అనుభవాన్ని ఇస్తుంది. అయితే ఇదే రైలు ప్రయాణంపై రైలు జీవితకాలం లేటు.. అంటూ సరదాగా కామెంట్ కూడా చేస్తుంటారు. అయితే ఒకొక్కసారి సరదాగా అన్న వ్యాఖ్యలే నిజమై నిలుస్తుంటాయి. తాజాగా ఓ రైలు.. లేటు అన్న పదానికి సరికొత్త అర్ధం ఇచ్చింది.. ఒక గంట.. లేక ఒక రోజో ఆ ట్రైన్ లేటుగా రాలేదు.. ఏకంగా ఏడాది కాలం లేటుగా వచ్చి.. ఆ రైలు చేరాల్సిన తన గమ్య స్థానానికి చేరుకుంది. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం అని తెలుస్తోంది. అయితే ఈ రైలు ఇలా లేట్ గా రావడం వలన జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. పేదలకు అందాల్సిన ఆహారధాన్యాలు పాడయ్యాయి.. ఈ ఘటన ఝార్ఖండ్​లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏడాది క్రితమే ఆహార ధాన్యాలను తీసుకుని బయటలుదేరిన గుడ్స్ రైలు తన గమ్యస్థానానికి ఈ ఏడాది మే 17న గమ్యస్థానానికి చేరుకుంది. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో జరిగిన ఈ ఘటన రైల్వే శాఖలో ప్రస్తుతం చర్చనీయాంశం మైంది. అయితే రైలు ఆలస్యంగా రావడానికి కారణం ఎక్కడ తప్పు జరిగిందనే విషయం తెలుసుకోవడానికి అధికారులు  విచారణ చేపట్టారు.

Goods Train 1

Goods Train 1

ఇండియన్ ఫుడ్ కార్పొరేషన్ కు చెందిన బియ్యం  1000 బ్యాగుల్లో ప్యాక్ చేయబడింది. ఈ ఆహారధాన్యాల బ్యాగ్స్ గూడ్స్ రైలు లో ఛత్తీస్‌గఢ్ రైల్వే స్టేషన్‌ నుంచి  2021 మేలో ఝార్ఖండ్ కు బయలు దేరడానికి లోడ్ చేశారు. ఛత్తీస్‌గఢ్ రైల్వే స్టేషన్‌ లో బయలుదేరిన ఈ రైలు తన గమ్య స్థానమైన జార్ఖండ్‌లోని న్యూ గిరిడి స్టేషన్‌కు చేరుకోవడానికి  762 కి.మీ. ప్రయాణించాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యతో రైలు ఒక్క అంగుళం కూడా కదలలేదు. అయితే ఇలాంటి సమస్య ఏర్పడినప్పుడు రైల్వే శాఖ అధికారులు వెంటనే స్పందించాల్సి ఉంది.. కానీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో చివరకు ఆ రైలు ఒక సంవత్సరం ఆలస్యంగా మే 17 (2022)న న్యూ గ్రిడియన్ స్టేషన్‌కు చేరుకుంది.

ఇవి కూడా చదవండి
Train Carrying Food Grains

Train Carrying Food Grains

అయితే షెడ్యూల్‌తో సంబంధం లేని రైలు స్టేషన్ కు చేరుకోవడంతో సిబ్బంది మొదట వ్వెరపోయారు. బోగిలో ఇండియన్ ఫుడ్ కార్పొరేషన్ కు చెందిన బియ్యం లోడు ఉన్నట్లు గుర్తించారు. ఏడాది ఆలస్యం కావడంతో 200-300 కట్టల బియ్యం పాడయ్యాయి. ఇక మిగిలిన వస్తువులు ఉపయోగించడానికి పనికి వస్తాయో లేదో చూడాల్సి ఉందని అధికారులు చెప్పారు. అంతేకాదు ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అధికారులు వచ్చి పరిస్థితిని పరిశీలించి సమగ్ర విచారణ జరుపుతారని గిరడ్డి కొత్త స్టేషన్‌ అధికారి పంకజ్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..