AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nepal Plane Missing: నేపాల్‌లో 22 మందితో వెళ్తున్న విమానం అదృశ్యం.. ఏటీసీతో తెగిన సంబంధాలు..

విమానంలో 22 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా.. వారిలో నలుగురు భారయతీయులు ఉన్నారు.

Nepal Plane Missing: నేపాల్‌లో 22 మందితో వెళ్తున్న విమానం అదృశ్యం.. ఏటీసీతో తెగిన సంబంధాలు..
Nepal Plane
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2022 | 12:15 PM

Share

Nepal Plane Missing: నేపాల్‌లో 22 మందితో వెళ్తోన్న తార ఎయిర్‌లైన్స్‌ విమానం అదృశ్యం అయింది. ఈ ఫ్లైట్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో (ఏటీసీ) సంబంధాలు తెగిపోయాయని అధికారులు ప్రకటించారు. దీంతో విమానం ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఈ విమానంలో 22 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురు భారయతీయులు ఉన్నారు. చివరిసారి ఈ విమానం ఉదయం 9:55 గంటలకు ఏటీసీతో టచ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముస్తాంగ్ జిల్లాలోని జోమ్‌సోమ్ ఆకాశంలో విమానం కనిపించిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత మౌంట్ ధౌలగిరికి వైపు వెళ్లిందని.. ఆ తర్వాత దానితో సంబంధాలు తెగిపోయినట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ మీడియాకు తెలిపారు. కాగా.. విమానం అదృశ్యం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాని ఆచూకీ కనుగునేందుకు అధికారులను అప్రమత్తం చేశారు.

10:35 తర్వాత ATSతో సంబంధాలు కట్..

10.30 తర్వాత విమానం – ఏటీసీతో ఎలాంటి సంబంధాలు లేవని అధికారులు తెలిపారు. విమానం 10:35 వరకు ATCని సంప్రదించింది. ప్రస్తుతం విమానం గురించి తెలుసుకోవడానికి హెలికాప్టర్‌ను పంపించారు. విమానాన్ని చివరిగా సంప్రదించిన ప్రాంతాలకు హెలికాప్టర్‌ను పంపినట్లు జోమ్‌సోమ్ ఎయిర్‌పోర్ట్ ATC తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

తారా ఎయిర్ ప్రకారం, విమానంలో సిబ్బందితో సహా మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 13 మంది నేపాలీ, నలుగురు భారతీయులు, ఇద్దరు జపాన్ పౌరులు. సిబ్బందిలో విమానం పైలట్, కెప్టెన్ ప్రభాకర్ ప్రసాద్ ఘిమిరే, కో-పైలట్ ఇటాసా పోఖారెల్,  ఎయిర్ హోస్టెస్ ఖాస్మీ థాపా ఉన్నారు. విమానం అదృశ్యమైనట్లు తారా ఎయిర్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ధృవీకరించారు. సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!