AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amalapuram Violence: కోనసీమ అల్లర్ల కేసులో మరో 25 మంది అరెస్ట్.. జిల్లాలో కొనసాగుతున్న ఆంక్షలు..

కోనసీమలో చెలరేగిన అల్లర్లలో అరెస్టులు పెరుగుతున్నాయి. కొత్తగా మరో 25మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవాళ మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Amalapuram Violence: కోనసీమ అల్లర్ల కేసులో మరో 25 మంది అరెస్ట్.. జిల్లాలో కొనసాగుతున్న ఆంక్షలు..
Amalapuram Violence
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2022 | 7:45 AM

Share

Konaseema Violence: కోనసీమ జిల్లా పేరుమార్పుపై చెలరేగిన హింసలో రోజురోజుకు అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 44మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. తాజాగా మరో 25మందిని అరెస్టు చేశారు. ఇవాళ మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అమలాపురం అల్లర్లపై డీఐజీ కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టణంలో బలగాల మోహరింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సిబ్బందితో సమీక్షించిన డీఐజీ.. కోనసీమలో మరో 24గంటలపాటు ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరో వారంపాటు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. అమలాపురంలో చెలరేగిన హింసతో జరిగిన ఆస్తి నష్టాన్ని నిందితుల ఆస్తులను జప్తుచేసైనా రాబడతామన్నారు.

టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించినట్లు తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా విధ్వంసానికి కుట్రచేసినట్లు తేల్చారు డీఐజీ. అరెస్టుల సంగతి ఏమోగాని.. పోలీసుల ఆంక్షలతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4రోజులుగా ఇంటర్నెట్‌ లేక ఉద్యోగులు సిగ్నళ్ల కోసం జిల్లా సరిహద్దుల్లో పడిగాపులుగాస్తూ పనులు కాక సతమతమవుతున్నారు. పోలీసులు చెబుతున్నట్లు మరో వారంలోపైనా.. సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయా అన్నది అనుమానమే అని స్థానికులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..