నడిరోడ్డుపై కారు బీభత్సం..మద్యం మత్తులో డ్రైవర్..ఎవరో తెలిసి కంగుతిన్న ఖాకీలు! ఇంతకీ ఎవరంటే..
నడిరోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఎంతో జాగ్రత్తగానే వెళ్తున్న ఇతర వాహనదారులు నలుగురిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. అయితే, ఆ కారులో ఉన్నది ఎవరో తెలిసే ఖాకీలే కంగుతిన్నారు.

శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీస్ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. మందుబాబులు, రౌడీ ముకలు, అకతాయిల అగడాలను అరికట్టాల్సిన ఖాకీ, మద్యం మత్తులో తేలిపోయాడు. ఫుటుగా మందేసి వాహనం నడుపుతూ ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మద్యం మత్తులో ఓ AR కానిస్టేబుల్ కారుతో బీభత్సం సృష్టించిన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో వాహనాన్ని నడుపుతున్న కానిస్టేబుల్ వాహనం అదుపుతప్పి ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న వాహనదారుల పైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు అదుపు తప్పి పడిపోవడంతో నలుగురు వాహనదారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. పక్కనే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై 108 కి సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న చీరాల వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న AR కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా AR కానిస్టేబుల్ ఒంగోలు లో విధులు నిర్వహిస్తున్న హనుమంతరావు గా పోలీసులు గుర్తించారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.