నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి భవనంలోంచి.. ఉన్నట్టుండి చిన్నారి ఏడుపులు.. తీరా దగ్గరికెళితే..

అదో ప్రభుత్వ ఆస్పత్రి భవనం..ఆస్పత్రిలో ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న ఓపీ భవనంలో అకస్మత్తుగా పసికందు ఏడుపు వినిపించసాగింది. దాంతో ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి భవనంలోంచి.. ఉన్నట్టుండి చిన్నారి ఏడుపులు.. తీరా దగ్గరికెళితే..
Govt Hospital
Follow us

|

Updated on: May 28, 2022 | 7:32 PM

అదో ప్రభుత్వ ఆస్పత్రి భవనం..ఆస్పత్రిలో ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న ఓపీ భవనంలో అకస్మత్తుగా పసికందు ఏడుపు వినిపించసాగింది. దాంతో ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనంలోంచి పసిపిల్లల ఏడుపు ఏంటని అంతా షాక్‌కు గురయ్యారు. ఎక్కడ్నుంచి చిన్నారి ఏడుపు వినిపిస్తుందని అంతా వెతికారు. చివరకు అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఎక్కడి వారు అక్కడే నిశ్చేస్టులయ్యారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది. అసలు వివరాల్లోకి వెలితే…

నంద్యాల జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి ప్రాంగణంలో నుతనంగా నిర్మిస్తున్న ఓపి భవనంలో గుర్తు తెలియని తల్లిదండ్రులు ఓ ఎనిమిది నెలల పాపను వదిలి వెళ్ళి పోయారు. ఏడుస్తూ ఉన్న పాపను స్థానికులు గమనించి ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పాపను ఆసుపత్రి మాతా శిశు సంక్షేమ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

పాపకి చికిత్స అందించడానికి వచ్చి ఇలా వదిలి వెళ్ళారా..? లేక ఆడపిల్లలను పెంచలేం అనుకొని వదిలి వెళ్ళరా ..? ఎందుకు ఏ పాపం ఎరుగని పసి పాపను ఇలా ఒంటరిగా భద్రంగా ఉండే ఓ భవనం వదిలి వెళ్ళారు..? అనేది ఎవరికి అంతు పట్టడం లేదు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ‌పాప పరిస్థితి కొంచెం విషంగా ఉందన్నారు. కానీ, ఎలాంటి అపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. పాప శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుందని, కొంచెం రక్తం కూడా తక్కువగా ఉందని చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ మాదవి తెలిపారు.

ఎనిమిది నెలల పాపను ఆసుపత్రి ప్రాంగణంలో ఎవరో వదిలి వెళ్ళారని సమాచారం రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాపను సంరక్షణ బాధ్యత ఐసిడిసి సిబ్బంది తీసుకుంది. చికిత్స పొందుతున్న పాపను రాత్రి పగలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక పాపను తమ సంరక్షణలోనే ఉంచుకుంటామని ఐసిడిసి సిబ్బంది తెలిపారు. పాపను ఎవరు వదిలి వెళ్ళారు అనే విషయం పై ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు