AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IndiGo: ఇండిగో ఎయిర్‌లైన్స్ కు రూ.5 ల‌క్ష‌ల ఫైన్..అసలు కారణం తెలిస్తే మీరు కూడా వేస్తారు..!

వికలాంగుడిని విమానం ఎక్కేందుకు నిరాకరించింది ఇండిగో ఎయిర్‌లైన్స్‌..విషయాన్నితీవ్రంగా పరిగణించిన ఏవియేషన్ రెగ్యులేటరీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) కఠిన చర్యలు తీసుకుంది.

IndiGo: ఇండిగో ఎయిర్‌లైన్స్ కు రూ.5 ల‌క్ష‌ల ఫైన్..అసలు కారణం తెలిస్తే మీరు కూడా వేస్తారు..!
Indigo Fined
Jyothi Gadda
|

Updated on: May 28, 2022 | 6:08 PM

Share

వికలాంగుడిని విమానం ఎక్కేందుకు నిరాకరించింది ఇండిగో ఎయిర్‌లైన్స్‌..విషయాన్నితీవ్రంగా పరిగణించిన ఏవియేషన్ రెగ్యులేటరీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) కఠిన చర్యలు తీసుకుంది. మే 7న రాంచీ విమానాశ్రయంలో వికలాంగ బాలుడిని విమానం ఎక్కకుండా ఇండిగో అడ్డుకుంది. దీంతో డీజీసీఏ కంపెనీకి రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ ఘటనపై డీజీసీఏ కూడా కంపెనీపై మండిపడింది.

ఈ సందర్భంగా డీజీసీఏ మాట్లాడుతూ.. ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణంగా స్పందించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది సందర్భానికి తగినట్లుగా వ్యవహరించడంలో విఫలమయ్యారని విమర్శించింది. పౌర విమానయాన నిబంధనల స్ఫూర్తికి విరుద్ధంగా వారి చర్య ఉందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో సంబంధిత నియమ, నిబంధనల మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు 5 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించినట్లు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఏవియేషన్‌ నిబంధనలను సవరిస్తామన్నారు. ఈ ఘటనపై విచారణకు డీజీసీఏ త్రిసభ్య కమిటీని వేసి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది.

విచారణలో భాగంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ, ఎయిర్‌లైన్స్ రెండు రకాల వివరణ ఇచ్చింది. ఎయిర్‌పోర్టుకు కారులో ప్రయాణించడానికి ఆ పిల్లవాడు అసౌకర్యంగా ఉన్నాడని, బోర్డింగ్ గేట్ వద్దకు రాగానే ఒత్తిడికి లోనయ్యాడని చెప్పారు. ఇతర ప్రయాణీకుల భద్రతను ఉటంకిస్తూ, వికలాంగ బాలుడు భయంతో, దూకుడుగా ప్రవర్తించాడని చెప్పారు. అతడు శాంతిస్తాడని గ్రౌండ్ స్టాఫ్ చివరి క్షణం వరకు వేచిచూశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో అతడిని విమానం ఎక్కకుండా అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. కాగా, ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కేంద్ర మంత్రి వ‌ర‌కు వెళ్లింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఫైర్ అయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై తానే స్వ‌యంగా ద‌ర్యాప్తు చేస్తాన‌ని వెల్ల‌డించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యం వెల్ల‌డించారు. వివ‌క్ష‌తో కూడా ఈ చ‌ర్య‌ల‌ను స‌హించేది లేద‌ని తెలిపారు. ద‌ర్యాప్తు అనంత‌రం స‌ద‌రు సంస్థ‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇండిగో భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ. చౌక విమాన సేవలు, సమయపాలన సంస్థ ముఖ్య లక్షణాలు. దేశీయ విమానయాన మార్కెట్లో కంపెనీ 50% పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది. కంపెనీ తన ఫ్లీట్‌లో 200 కంటే ఎక్కువ విమానాలను కలిగి ఉంది. సంస్థ దేశీయంగా, అంతర్జాతీయంగా తన సేవలను అందిస్తుంది.