ట్రాక్ట‌ర్ న‌డుపుతూ పెళ్లి మండ‌పానికి వ‌చ్చిన పెళ్లికూతురు, నల్ల కళ్లజోడు పెట్టుకుని, అందరూ చూస్తుండగానే..

కాలం మారింది. కాలంతో పాటే, పనులు, పద్ధుతులూ మారుతున్నాయి. ఈ క్రమంలోనే పెళ్లిళ్లు, పెళ్లి తతాంగాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగానే సెట్‌ చేసుకుంటున్నారు నేటి తరం యువతీ యువకులు. ముఖ్యంగా

ట్రాక్ట‌ర్ న‌డుపుతూ పెళ్లి మండ‌పానికి వ‌చ్చిన పెళ్లికూతురు, నల్ల కళ్లజోడు పెట్టుకుని, అందరూ చూస్తుండగానే..
Bride
Follow us
Jyothi Gadda

|

Updated on: May 28, 2022 | 6:04 PM

కాలం మారింది. కాలంతో పాటే, పనులు, పద్ధుతులూ మారుతున్నాయి. ఈ క్రమంలోనే పెళ్లిళ్లు, పెళ్లి తతాంగాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగానే సెట్‌ చేసుకుంటున్నారు నేటి తరం యువతీ యువకులు. ముఖ్యంగా నాటి పెళ్లి కార్యక్రమాలకు, నేటి పెళ్లి సందడులకు ఎంతో వ్యత్యాసం వచ్చింది..ఈ రోజుల్లో పెళ్లంటా హడావుడి మామూలుగా లేదు. ఇక పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు చేసే వింతలు, విన్యాసాలు చాలానే ఇంటర్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. పెళ్లిలో సిగ్గు ప‌డాల్సిన పెళ్లి కూతుర్లు డ్యాన్స్ ని ఇర‌గ‌దీస్తున్నారు. పెళ్లి పందిట్లోనే డ్యాన్స్‌లు, పాటలు, జోకులతో అదరగొడుతున్నారు.

అప్పట్లో ఓ పెళ్లి కూతురు బుల్లెట్టు బండి పాటకు డ్యాన్స్ చేయటం సోషల్‌ మీడియలో సంచలనం రేపింది. పెళ్లి తరువాత జరిగే అప్పగింతల్లో ఆ నవ వధువు నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని,..అంటూ ఫుల్‌ జోష్‌తో వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక అలాంటి వీడియోలు అనేకం నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ పెళ్లి కూతురు కుమారై ఏకంగా ట్రాక్ట‌ర్ ని డ్రైవ్ చేస్తూ క‌ల్యాణ మండ‌పానికి చేరుకోవ‌డం ఇప్పుడు నెటిజన్లు మరింత ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా జావ్రా గ్రామంలో ఓ నవ వధువు ట్రాక్టర్ నడుపుకుంటూ కల్యాణ మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రామానికి చెందిన భారతి తద్గేకు పొరుగూరు యువకుడితో వివాహం నిశ్చయమైంది. వధువు భారతి తన అన్నదమ్ములిద్దరినీ చెరో పక్కన కూర్చోబెట్టుకుని ట్రాక్టర్ నడుపుకుంటూ మండపానికి చేరుకుంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు, నల్లని కళ్లద్దాలు ధరించి హుందాగా ట్రాక్టర్ నడుపుకుంటూ మండపానికి వచ్చింది. పెళ్లి కుమార్తె అలా రావడం చూసిన వరుడు సహా పెళ్లికొచ్చిన బంధువులు, స్నేహితులు అంతా షాకయ్యారు.

ఇవి కూడా చదవండి

A bride in Betul arrived at her wedding on a tractor. The bride, Bharti Tagde, is seen entering the wedding pavilion wearing black glasses and riding a tractor. On the tractor, she is accompanied by her two brothers @ndtv @ndtvindia pic.twitter.com/apdqrIBvyA

— Anurag Dwary (@Anurag_Dwary) May 27, 2022

ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. పెళ్లి కుమార్తెకు తమదైన స్టైల్లో విషేస్‌ కూడా చెబుతున్నారు.